Soybean Dosa : సాధారణంగా రోజూ చాలా మంది భిన్న రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తయారు చేసుకుని తింటుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమ రుచికి, ఇష్టానికి అనుగుణంగా దోశలను తయారు చేసి తింటారు. అయితే వీటిని ఆరోగ్యకరంగా తయారు చేసుకుంటే.. ఓ వైపు రుచి, మరోవైపు పోషకాలు.. రెండింటినీ పొందవచ్చు. ఇక వీటిని ఆరోగ్యకరంగా తయారు చేయాలంటే.. అందుకు సోయాబీన్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
సోయాబీన్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. కనుక వీటితో దోశలను తయారు చేసి తింటే.. ఓ వైపు రుచి.. మరోవైపు పోషకాలను పొందవచ్చు. ఇక సోయాబీన్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సోయాబీన్ దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
సోయాబీన్స్ – ముప్పావు కప్పు, అవిసె గింజలు – రెండు టీస్పూన్లు, బియ్యం పిండి – మూడు టీస్పూన్లు, పచ్చి మిర్చి – రెండు, అల్లం – కొద్దిగా, ఉప్పు, నీళ్లు, నూనె – తగినంత.
సోయాబీన్ దోశలను తయారు చేసే విధానం..
సోయాబీన్స్, అవిసె గింజలను బాగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వీటిని వడకట్టి మిర్చి, అల్లం వేసి కలిపి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇందులో బియ్యం పిండి, ఉప్పు వేసి కలిపి దోశల్లా వేసుకోవచ్చు. అయితే దోశలను రెండు వైపులా కాల్చాలి. దీంతో రుచిగా ఉంటాయి. ఇలా సోయాబీన్ దోశలను తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచి.. ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.