Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Spicy Butter Chicken Fry : స్పైసీ బ‌టర్ చికెన్ ఫ్రై ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

D by D
December 5, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spicy Butter Chicken Fry : మ‌నం చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ ఫ్రైను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా చికెన్ ఫ్రైను మరింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ స్పైసీ బ‌ట‌ర్ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క‌సారి ఈ చికెన్ ఫ్రైను తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎవ‌రైనా కూడా ఈ చికెన్ ఫ్రైను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. మ‌రింత రుచిగా చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ బ‌ట‌ర్ చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడ‌వుగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, యాల‌కులు – 4, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Spicy Butter Chicken Fry recipe in telugu make in this way
Spicy Butter Chicken Fry

స్పైసీ బ‌ట‌ర్ చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో మ‌సాలా దినుసులు, జీల‌కర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత చికెన్, ఉప్పు, కారం, కాశ్మీరి కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించిన త‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి వేయించాలి. దీనిని 10 నిమిషాల పాటు వేయించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు వేయించాలి. చికెన్ పూర్తిగా వేగిన త‌రువాత ఫ్రెష్ క్రీమ్, బ‌ట‌ర్, వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ బట‌ర్ చికెన్ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Spicy Butter Chicken Fry
Previous Post

Restaurant Style Egg Fried Rice : రెస్టారెంట్‌కు వెళ్ల‌కుండానే అదే రుచితో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Next Post

Pimples Home Remedies : మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే ఏకైక ఆయుధం ఇది.. ఇలా చేయాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.