Sweet Bonda : మనం బెల్లాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బెల్లంతో చేసుకోదగిన వివిధ రకాల తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తయారు చేసేవారు. ఈ బొండాలను తయారు చేయడం కూడా చాలా తేలిక. కరకరలాడుతూ రుచిగా, కమ్మగా ఉండే బెల్లం బోండాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం బోండాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – 200 గ్రా., నీళ్లు – పావు కప్పు, పెరుగు – పావు కప్పు, వంటసోడా – ఒక టీ స్పూన్, బొంబాయి రవ్వ- 2 టేబుల్ స్పూన్స్, గోధుమ పిండి – 400 గ్రా., ఉప్పు – చిటికెడు, సోంపు గింజలు -ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెల్లం బోండాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగు, వంటసోడా, రవ్వ వేసి కలపాలి. తరువాత దీనిని 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత సట్వ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగులో బెల్లం పాకాన్ని వేసి కలపాలి. తరువాత గోధుమపిండి, ఉప్పు, సోంపు గింజలు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలిపిన తరువాత మరో కప్పు నీళ్లు పోసి కలపాలి. పిండి కలిపిన తరువాత 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. తరువాత లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత పిండిని తీసుకుని బోండాలుగా వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం బోండాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉంటాయి.