Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Cashew Nuts Masala Curry : ట‌మాటా, జీడిప‌ప్పు కూర ఇలా చేయండి.. రైస్‌, చ‌పాతీ, పులావ్‌ల‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
March 15, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Cashew Nuts Masala Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల మ‌సాలా కూర‌ల‌ల్లో ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఎక్కువ‌గా రోటి, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని ఈ కూర‌తో తింటూ ఉంటారు. ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను అచ్చం అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా, లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట కాజు మ‌సాలా కర్రీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ట‌మాటాలు – 4, త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Cashew Nuts Masala Curry recipe in telugu how to make
Tomato Cashew Nuts Masala Curry

మ‌సాలా దినుసులు..

నువ్వులు – 2 టీ స్పూన్స్, జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, సార ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 2.

ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మ‌సాలా దినుసుల‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పావు గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ట‌మాటాల‌ను కూడా జార్ లో వేసి ఫ్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించాలి. దీనిని రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ట‌మాట ఫ్యూరీ, ఉప్పు, ప‌సుపు, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌లపాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. మ‌సాలా చ‌క్క‌గా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత దీనిలో వేయించిన జీడిప‌ప్పు, క‌సూరి మెంతి, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో మూడు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, పులావ్, బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట కాజు మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Cashew Nuts Masala Curry
Previous Post

Ulcer : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అల్స‌ర్ ఉన్న‌ట్లే..!

Next Post

Blackheads : కేవ‌లం 5 నిమిషాల్లో ఇలా బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!