Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Veg Biryani : వెజ్ బిర్యానీ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!

D by D
January 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Veg Biryani : మ‌నం చికెన్, మ‌ట‌న్ వంటి వాటితోనే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా బిర్యానీ త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని సుల‌భంగా, రుచిగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా తేలిక‌గా చేసేలా ఈ వెజ్ బిర్యానీ ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి క‌కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – 4 టీ గ్లాసులు, నీళ్లు – 6 టీ గ్లాసులు, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బీన్స్ – అర క‌ప్పు, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, నాన‌బెట్టిన మీల్ మేక‌ర్ – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, జీడిప‌ప్పు పలుకులు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, బిర్యానీ మ‌సాలా – రెండు టీ స్పూన్స్, పెరుగు – అర క‌ప్పు.

Veg Biryani recipe in telugu make in this way
Veg Biryani

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క ముక్క‌లు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, యాల‌కులు – 4, ల‌వంగాలు – 4, అనాస‌ పువ్వులు – 2.

వెజ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డగాలి. త‌రువాత నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక కుక్క‌ర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత కారం, బిర్యానీ మ‌సాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, మీల్ మేక‌ర్, జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కొత్తిమీర‌, పుదీనా కూడా వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం నీటితో స‌హా వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి పెద్ద మంట‌పై 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి అంతా ఒక‌సారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వెజ్ బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఇంట్లో వాళ్లు ఇంకా కావాల‌ని అడిగి మరీ ఇష్టంగా తింటారు.

Tags: Veg Biryani
Previous Post

Warm Water For Mucus : వేడి నీళ్లతో ఇలా చేస్తే.. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం ఇలా బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Next Post

Sesame Oil For Hair : జుట్టుకు ఇదొక్క‌టి రాస్తే చాలు.. న‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.