Viral Video : ప్రమాదాలు సంభవించే సమయంలో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దీంతో ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి నష్టం లేకుండా బయట పడేందుకు వీలుంటుంది. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న షిరూర్ అనే ఆగ్రో టూరిజం సెంటర్ నుంచి ఓ మినీ బస్సు వస్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను బస్సును అడ్డ దిడ్డంగా పోనివ్వసాగాడు. ఈ క్రమంలో బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు తీవ్రంగా భయపడ్డారు. అయితే అప్పుడే 42 ఏళ్ల యోగితా సతవ్ అనే మహిళ చాకచక్యంగా వ్యవహరించింది.
సదరు డ్రైవర్‌ను సీట్ నుంచి తీసి పక్కన పడుకోబెట్టి వెంటనే స్టీరింగ్ అందుకుంది. తనకు కార్ నడిపిన అనుభవం ఉంది. దీంతో ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆ మినీ బస్సును పరుగెత్తించింది. అలా ఆమె ఆ బస్సును సుమారుగా 10 కిలోమీటర్ల దూరం నడుపుతూ వచ్చి ఆ డ్రైవర్‌ను హాస్పిటల్లో చేర్పించింది. అనంతరం ఆ బస్సులో ఉన్నవారి తమ తమ ఇళ్ల వద్ద దింపేసింది.
#Pune woman drives the bus to take the driver to hospital after he suffered a seizure (fit) on their return journey. #Maharashtra pic.twitter.com/Ad4UgrEaQg
— Ali shaikh (@alimshaikhTOI) January 14, 2022
కాగా ఆ మహిళ బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. అందరూ ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు. అయితే వీడియో పాతదే అయినప్పటికీ నెటిజన్లు మళ్లీ షేర్ చేస్తున్నారు.