IPL ఓ పెద్ద సంబురం… దాదాపు రెండు నెలల పాటు జరిగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గేమ్.! బాల్ టు బాల్ ఉత్కంఠ, ఎన్ని సిక్సులు కొట్టారు…ఎన్ని గ్రౌండ్ అవతల పడ్డాయనే లెక్కలు…చిన్న చిన్న బెట్టింగ్స్..!! ఇలా రెండు నెలలు అలరించే గేమ్ IPL.! కానీ తెర వెనుక IPL ఓ బిగ్ కమర్షియల్ ఈవెంట్…కోట్ల రూపాయల బిజినెస్… పెద్ద స్థాయిలో తమ తమ బ్రాండ్స్ ప్రమోషన్స్.. ఛీర్ గర్ల్స్ దగ్గరి నుండి థర్డ్ అంపైర్ స్క్రీన్ వరకు అంతా ఓ వింతే.!
ఓపెనింగ్ సెరోమనీ నుండి క్లోజింగ్ డే వరకు …ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే… అయితే IPL లో టాస్ వేసే కాయిన్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. జనరల్ గా టాస్ కాయిన్ అంటే మనం రౌండ్ షేప్ నే ఎక్స్ పెక్ట్ చేస్తాం..అలా కాకుండా స్క్వైర్ షేప్ లో ఉన్న IPL కాయిన్ టాస్… ఓ బంగారు ఆభరణాల డిజైనర్ తో ప్రత్యేకంగా రూపొందించారు. దీని డిజైన్ అండ్ తయారీకి దాదాపు 3 లక్షలకు పైగానే ఖర్చు అయ్యిందని సమాచారం.!
బ్యాట్స్ మన్ ఐకాన్….తో పాటు IPL అనే టెక్ట్స్ తో పాటు H( హెడ్స్ ) ప్రింట్ కలిగిన ఈ టాస్ కాయిన్ కాస్త విన్నూత్నంగా ఉంది.! అయితే టాస్ కాల్ చేసిన ప్రతి కెప్టెన్ హెడ్స్ చెప్పడానికే ఇష్టపడతారట.! ఇలాంటి వెయిట్ కాయిన్స్ స్పిన్ చేసినప్పుడు హెడ్స్ పడే సంభావ్యతే ఎక్కువగా ఉంటుందట.!