Fennel Seeds For Weight Loss : చాలా మంది, రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా, అనారోగ్య సమస్యల వలన బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. ఎక్కువ మంది, ఈ రోజులులో అధిక బరువు సమస్య వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, కచ్చితంగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి, ట్రై చేసే వాళ్ళు ఇలా కనుక చేసినట్లయితే, బరువు తగ్గడానికి అవుతుంది. మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ మనకి దొరుకుతుంటాయి. వాటిని వాడి, ఈజీగా బరువు తగ్గిపో వచ్చు అని చెప్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రతి రోజు, అరగంట వ్యాయామం చేస్తే కచ్చితంగా బరువు తగ్గడానికి అవుతుంది. అలానే, ఈ డ్రింక్ తాగితే కూడా ఎంతో బాగుంటుంది.
15 రోజుల్లోనే అధిక బరువు సమస్య నుండి బయటకి వచ్చేయొచ్చు. ఈ డ్రింక్ తో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి, గ్లాసున్నర నీళ్లు పోసి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి, అందులోనే జీలకర్ర, సోంపు, వాము వేసి ఐదు నుండి ఏడు నిమిషాలు పాటు మరిగించుకోండి.
ఈ విధంగా మరిగించి, తర్వాత నీటిని వడకట్టేసి అర చెక్క నిమ్మరసం, కొంచెం తేనె వేసి మిక్స్ చేయండి. పరగడుపున తాగితే బరువు తగ్గవచ్చు. ఉదయం అల్పాహారం తిన్న తర్వాత మాత్రమే గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవాలి. 15 రోజులు పాటు ఇలా చేస్తే బరువు తగ్గిపో వచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.