వెజిటేరియన్లుగా ఉండడమంటే మాటలు కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వెజిటేరియన్ డైట్‌ను పాటించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. బరువు తగ్గడం తేలికవుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇంకా ఎన్నో లాభాలు వెజిటేరియన్ డైట్ వల్ల కలుగుతాయి.
అయితే వెజిటేరియన్లకు కాల్షియం లభించాలంటే ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. నాన్ వెజ్ తినేవారికి అయితే గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం తింటారు కనుక కాల్షియం బాగానే లభిస్తుంది. అయితే వెజిటేరియన్లకు కూడా కాల్షియం లభించే పలు ఉత్తమమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటంటే..
చియా విత్తనాలను సూపర్ ఫుడ్‌గా చెబుతారు. వీటిల్లో దాదాపుగా అన్ని పోషకాలు ఉంటాయి. 30 గ్రాముల చియా విత్తనాలను తింటే 11 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. మనకు రోజూ కావల్సిన కాల్షియంలో 18 శాతం మేర పొందవచ్చు. పండ్ల రసాలు, ఓట్స్, సలాడ్స్ తో కలిపి చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
అంజీర్ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయి. 2 అంజీర్ పండ్లను తినడం వల్ల 65 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది.
కాల్షియం ఉన్న ఉత్తమమైన ఆహారాల్లో సోయాబీన్స్ ఒకటని చెప్పవచ్చు. సోయా పాలు, సాస్ వంటి ఆహారాల ద్వారా కాల్షియం లభిస్తుంది.
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే ఈ పండ్లలో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక మీడియం సైజ్ నారింజ పండును తింటే 55 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది.
ఆకుపచ్చని కూరగాయలను తినడం వల్ల మనకు రోజూ కావల్సిన కాల్షియంలో 20 శాతం మేర లభిస్తుంది. అలాగే కాల్షియం కోసం బ్లాక్ బీన్స్ ను కూడా వెజిటేరియన్లు తీసుకోవచ్చు. 30 గ్రాముల బ్లాక్ బీన్స్‌ను తింటే మనకు రోజుకు కావల్సిన కాల్షియంలో 29 శాతం లభిస్తుంది. అలాగే ఐరన్, ప్రోటీన్లు, ఫైబర్ లభిస్తాయి.