విటమిన్‌ సి తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!!

విటమిన్‌ సి మనకు అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులకు సహాయపడుతుంది. అనేక ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. స్కర్వి అనే వ్యాధి చికిత్సలో పనిచేస్తుంది. విటమిన్‌ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది కనుక విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది. విటమిన్‌ సి ఆహారాల్లోనే కాక సప్లిమెంట్ల రూపంలోనూ మనకు లభిస్తుంది.

9 health benefits of taking vitamin c

విటమిన్‌ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు

విటమిన్ సి లోపం ఉంటే అలసట, మానసిక స్థితిలో మార్పులు, బరువు తగ్గడం, కీళ్లు, కండరాల నొప్పులు, గాయాలు, దంత సమస్యలు, జుట్టు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్‌ సి నీటిలో కరుగుతుంది. కనుక దీన్ని మనం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.

1. విటమిన్‌ సి ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే సోడియంను బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాల గోడలు ఆరోగ్యంగా ఉంటాయి.

2. కొల్లాజెన్ మన చర్మం, ఇతర బంధన కణజాలాలలో ఉండే ఒక నిర్మాణ ప్రోటీన్. ఇది సాధారణంగా మన శరీరంలోని అన్ని కణాలు, కణజాలాలను కలిపే ‘జిగురు’ను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మన గుండె ధమనులలో మంటను తగ్గించడానికి మన శరీరం తగినంత మొత్తంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయాలి. ఇది విటమిన్ సి తీసుకోవడం వల్ల సాధ్యమవుతుంది.

3. విటమిన్‌ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల చిత్త వైకల్యం ప్రమాదం తగ్గుతుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యంగా జరిగేలా చేస్తుంది.

4. మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించాలంటే అందుకు విటమిన్‌ సి ఉపయోగపడుతుంది. కనుక విటమిన్‌ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

5. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు అధికం అయితే గౌట్‌ సమస్య వస్తుంది. విటమిన్‌ సి ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు తగ్గుతాయి. గౌట్‌ సమస్య తగ్గుతుంది.

6. విటమిన్‌ సి శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి.

7. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు విటమిన్‌ సి ఉపయోగపడుతుంది. విటమిన్‌ సి ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

8. చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. దీని వల్ల బరువు కూడా పెరుగుతారు. జీవక్రియలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే విటమిన్‌ సి ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీని వల్ల జీవక్రియలు సరిగ్గా జరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

9. విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ కణాలు సంరక్షించబడతాయి.

ఎవరెవరికి రోజూ ఎంత విటమిన్‌ సి అవసరం అంటే ?

  • అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 నెలల వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 40 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్‌ సి అవసరం అవుతుంది.
  • 7 నుంచి 12 నెలల వారికి 50 మిల్లీగ్రాములు
  • 1 నుంచి 3 ఏళ్ల వయస్సు వారికి 15 మిల్లీగ్రాములు
  • 4 నుంచి 8 ఏళ్లు ఉన్నవారికి 25 మిల్లీగ్రాములు
  • 9 నుంచి 13 ఏళ్ల వారికి 45 మిల్లీగ్రాములు
  • 14 నుంచి 18 ఏళ్ల వారికి ( బాలురు) 75 మిల్లీగ్రాములు
  • 14 నుంచి 18 ఏళ్ల వారికి (బాలికలు) 65 మిల్లీగ్రాములు
  • పురుషులకు 90 మిల్లీగ్రాములు
  • స్త్రీలకు 75 మిల్లీగ్రాములు
  • గర్భిణీలకు 85 మిల్లీగ్రాములు
  • పాలిచ్చే తల్లులకు 120 మిల్లీ గ్రాముల వరకు రోజూ విటమిన్‌ సి అవసరం అవుతుంది.

విటమిన్‌ సి మనకు నారింజ పండ్లు, ఉసిరి, కివీలు, క్యాప్సికం, టమాటాలు, వెల్లుల్లి, ద్రాక్ష, పచ్చి బఠానీలు, అరటి పండ్లు, గ్రీన్‌ యాపిల్‌ తదితర పదార్థాల్లో లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts