Dry Apricots : స్త్రీలల్లో నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు, నీటి బుడగలు, అధిక రక్తస్రావం, ఎముకలు గుళ్లబారిపోవడం, మానసిక ఆందోళన, సంతానలేమి వంటి అనేక రకాల సమస్యలు రావడానికి ప్రధాన కారణాలల్లో వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం కూడా ఒకటి. ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల స్త్రీలల్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఈ హార్మోన్ స్థాయిలు పెరగడానికి చాలా మంది వైద్యులు మందులను సూచిస్తూ ఉంటారు. మందులతో పాటు సహజ సిద్దంగా కూడా మనం ఈ హార్మోన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈస్ట్రోజన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం సహజంగా ఈ హార్మోన్ ను పెంచుకోవచ్చు. ఈ ఈస్ట్రోజన్ మొక్కల్లో ఫైటో ఈస్ట్రోజన్ రూపంలో ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల ఫైటో ఈస్ట్రోజన్ శరీరంలోకి వెళ్లిన తరువాత ఈస్ట్రోజన్ గా మారుతుంది. మొక్కలకు సంబంధించిన ఏయే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ మన శరీరానికి అందుతుంది అలాగే ఏయే పదార్థాల్లో ఎంత ఈస్ట్రోజన్ ఉంటుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల అవిసె గింజల్లో 0.5 నుండి 1.3 గ్రాములు ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. అలాగే 100 గ్రాములు సోయా చిక్కుడు గింజల్లో 4.2గ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడంలో సోయా గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక డ్రై ఆప్రికాట్స్ లో 200 మిల్లీ గ్రాములు, నువ్వుల్లో 48 మిల్లీ గ్రాములు, బీన్స్ లో 1.2 గ్రాములు, డ్రై బెర్రీస్ లో 200 నుండి 800 మిల్లీ గ్రాములు, గోధుమ తవుడులో 180 మిల్లీ గ్రాములు, తోఫూ( సోయా పన్నీర్) లో రెండున్నర గ్రాముల నుండి మూడు గ్రాములు, క్యాబేజీలో 787 మిల్లీ గ్రాములు, బ్రొకోలిలో 300 నుండి 500 మిల్లీ గ్రాములు, ఆల్ఫా ఆల్ఫా విత్తనాల్లో 300 మిల్లీ గ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది.

ఈ ఆహారాలను స్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ గా మారి శరీరానికి అందుతుంది. నెలసరి సమస్యలతో బాధపడే వారు, సంతానలేమి సమస్యలతో బాధపడే వారు, మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అండాశయాల్లో నీటి బుడగలు, నెలసరి సమయంలో రక్తస్రావం సమస్యలతో బాధపడే స్త్రీలు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే అన్నీ రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. స్త్రీలు ఈ విధమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.