ప‌ప్పు దినుసుల‌ను ఇలా తీసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

ప‌ప్పు దినుసుల‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో ఒక మోస్త‌రు క్యాల‌రీలు ఉంటాయి. కానీ శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ తోపాటు జింక్‌, ఐర‌న్‌, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ప‌ప్పు దినుసుల‌ను నిత్యం మ‌నం ఆహారంలో భాగం చేసుకుంటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. అయితే ప‌ప్పు దినుసుల వ‌ల్ల పూర్తి స్థాయిలో ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని న్యూట్రిష‌నిస్టులు చెప్పిన విధంగా తినాల్సి ఉంటుంది.

eating pulses this way can give you maximum benefits

* ప‌ప్పు దినుసుల‌ను డ్రై ఫ్రూట్స్ తో క‌లిపి తిన‌రాదు. విడిగా తినాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

* ప‌ప్పు దినుసుల‌ను నాన‌బెట్టి తిన‌వ‌చ్చు. అదే సోయా లాంటి చిక్కుడు జాతి గింజ‌ల‌ను అయితే మొల‌కెత్తించి తింటే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

* ప‌ప్పు దినుసుల‌ను అన్నంతో అయితే 1/3 వ వంతులో తినాలి. అంటే తినే అన్నంలో 1/3వ వంతు మేర ప‌ప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి. అదే చిరు ధాన్యాల‌తో ప‌ప్పు దినుసుల‌ను తింటే రెండింటినీ స‌మాన భాగాలుగా చేసి క‌లిపి తినాల్సి ఉంటుంది. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అమైనో ఆమ్లాలు క‌చ్చిత‌మైన మోతాదులో అందుతాయి.

* ఇక వారంలో క‌నీసం 5 ర‌కాల ప‌ప్పు దినుసుల‌ను తింటే మంచిది. నెల‌కు వాటిని 5 భిన్న రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఒక‌సారి ప‌ప్పు రూపంలో, ఇంకోసారి ఉడ‌క‌బెట్టి, ఇంకోసారి మొల‌క‌లుగా.. ఇలా నెల‌కు 5 ర‌కాలుగా వాటిని తింటే మంచిది. దీని వల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది.

ఇక నిత్యం అర క‌ప్పు మోతాదులో బీన్స్ లేదా ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, ఇత‌ర ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయ‌ని వైద్య నిపుణులు తెలిపారు. ప‌ప్పు దినుసులలో ఉండే ఫైటో కెమిక‌ల్స్, సాపోనిన్స్, టానిన్స్, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ కార్సినోజెనిక్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువల్ల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ప‌ప్పు దినుసుల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. హైబీపీ త‌గ్గుతుంది. వాపులు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని నిత్యం తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. శ‌ర‌రీంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఉండ‌వు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా ఉంటుంది. ఇలా ప‌ప్పు దినుసుల వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ వాటిని పైన తెలిపిన విధంగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Share
Admin

Recent Posts