Strawberries : స్ట్రాబెర్రీలు చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే నోరూరిపోతుంది. స్ట్రాబెర్రీలను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే ధర ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తినేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. స్ట్రాబెర్రీలను తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
2. స్ట్రాబెర్రీలలో గుండెకు మేలు చేసే పోషకాలు సమ్మేళనాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
3. స్ట్రాబెర్రీలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. స్ట్రాబెర్రీలను తరచూ తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచూ స్ట్రాబెర్రీలను తింటే ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు.