Black Spot Banana : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం వివిధ రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పండ్లను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండ్లు కూడా ఒకటి. మనకు అన్ని కాలాల్లో అలాగే చౌకగా లభించే వాటిల్లో అరటి పండ్లు కూడా ఒకటి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం.
చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. అరటి పండును తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది బాగా పండిన అరటి పండును అలాగే నల్ల మచ్చలు ఉన్న అరటి పండును తినడానికి ఇష్టపడరు. కంటికి ఇంపుగా ఉండే అరటి పండ్లను తినడం కంటే బాగా పండి నల్ల మచ్చలు ఉన్న అరటి పండును తింటేనే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నల్లటి మచ్చలు ఉన్న అరటి పండును తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా పండిన అరటి పండులో టీఎన్ఎఫ్ (ట్యూమర్ నిక్రోసిస్ ఫ్యాక్టర్) అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే చెడు కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కనుక బాగా అరటి పండును తింటే పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని నల్ల మచ్చలు ఉంటే ఆ అరటి పండు అంత బాగా పండిందని అర్థం. పండిన అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పండిన అరటి పండును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మనం రోగాల బారిన పడకుండా ఉంటాం.
అలాగే అలాంటి పండ్లలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారి త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచడంలో బాగా పడిన అరటి పండు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఒకటి లేదా రెండు నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లను తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అరటి పండులో ఉన్న పోషకాలను పొందాలంటే దానిని ఫ్రిజ్ లో ఉంచకూడదు. తాజాగా ఉండే బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల మాత్రమే అధిక పోషకాలను.. అలాగే అధిక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు.