Fat : మనకు ఈ సీజన్‌లో లభించే అతి ముఖ్యమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇది ఎంతో తియ్యగా ఉంటుంది. బాగా పండిన సీతాఫలాన్ని తింటే వచ్చే మజాయే వేరు. ఈ పండులో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల ఈ పండును రోజూ తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
సీతాఫలం పండు గుజ్జును రోజుకు 100 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
1 సీతాఫలం పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. కణాలు సురక్షితంగా ఉంటాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
2. ఈ పండ్లలో ఉండే విటమిన్ బి6 మూడ్‌ను మారుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. విటమిన్ బి6 వల్ల మన శరీరంలో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ విడుదల అవుతాయి. సెరొటోనిన్, డోపమైన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.
3. సీతాఫలం పండ్లలో లుటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు తగ్గిస్తుంది. కంటి చూపు స్పష్టంగా లేనివారు ఈ పండ్లను తింటే ప్రయోజనం కలుగుతుంది.
4. సీతాఫలాల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు.
5. సీతాఫలాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
6. పలు రకాల క్యాన్సర్లను నివారించే గుణాలు సీతాఫలం పండ్లలో ఉన్నాయి. ఈ పండ్ల వల్ల కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
7. అధిక బరువు ఉన్నవారు సీతాఫలం పండ్లను తినడం వల్ల బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.