Apples : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. అలాగే మనం రకరకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల పండ్లను తిన్న తరువాత తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఇలా ఎప్పుడు పడితే తినకూడని పండ్లల్లో ఆపిల్ ఒకటి. ఆపిల్ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేల చేసే ఆపిల్ తిన్న తరువాత కొన్ని పదార్థాలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఆపిల్ ను ఏ సమయంలో తీసుకోవాలి.. ఆపిల్ తీసుకున్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ ను తీసుకోవడం వల్ల మనం రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఆపిల్ ను తీసుకోవడం వల్ల క్యాల్షియం, పొటాషియంలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు మనకు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తిని ఆపిల్స్ మన శరీరానికి అందిస్తాయి. ఆపిల్ ను తీసుకున్న తరువాత కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం అసలు తీసుకోకూడదు. చాలా మంది ఆపిల్ ను తిన్న తరువాత మంచి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఆపిల్ ను తిన్న తరువాత నీటిని తాగడం వల్ల శరీరంలో కఫం పేరుకుపోతుంది. కనుక ఆపిల్ ను తిన్న 30 నిమిషాల నుండి గంట తరువాత మాత్రమే నీటిని తాగాలి.
అలాగే ఆపిల్ ను తిన్న తరువాత పుల్లగా ఉండే పండ్లను కానీ, పుల్లటి పదార్థాలను కానీ తీసుకోకూడదు. ఆపిల్ తిన్న తరువాత పుల్లటి పదార్థాలను తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అదే విధంగా ఆపిల్ ను తిన్న తరువాత ముల్లంగిని తీసుకోకూడదు. ఇవి రెండు విరుద్ద ఆహారాలు. ఆపిల్ తిన్న తరువాత ముల్లంగిని తీసుకోవడం వల్ల అలర్జీలు, చర్మంపై తెల్లటి మచ్చలు, దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఆపిల్ తిన్న తరువాత ముల్లంగిని అస్సలు తీసుకోకూడదు. అలాగే ఆపిల్ తిన్న తరువాత పెరుగును తీసుకోకూడదు. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆపిల్ లో పోషకాలతో పాటు యాసిడ్లు కూడా ఉంటాయి. వీటిని రాత్రి పూట తినడం వల్ల పొట్టలో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. ఆపిల్ ను ఉదయం పూట అల్పాహారం తీసుకున్న తరువాత తింటే చాలా మంచిది.