Singapore Cherry : కొన్ని చెట్లను మనం ప్రత్యేకంగా పెంచపోయినప్పటికి పక్షుల ద్వారా వ్యాప్తి చెంది వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. అలాంటి మొక్కలల్లో నక్క రేగి చెట్టు కూడా ఒకటి. దీనిని కొన్ని ప్రాంతాల్లో కుక్క మోగి అని కూడా అంటారు. ఈ చెట్టును చాలా మంది ఇంటి ముందు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం మొటింగియా క్యాలబురా. దీనిని ఇంగ్లీష్ లో సింగపూర్ చెర్రీ, జమైకా చెర్రీ, పనామా చెర్రీ అని అంటారు.ఈ నక్క రేగి చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు, పూలు, కాయలను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ చెట్టు కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తియ్యగా, పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఈ చెట్టు పూలను ఉపయోగించి తలనొప్పిని, ప్రారంభ దశలో ఉన్న జలుబును తగ్గించడంలో ఈ చెట్టు పూలు ఉపయోగపడతాయి.
ఈ చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించే సమర్థతా కూడా ఈ ఈకులకు ఉంది. అలాగే ఈ నక్క రేగి పండ్లు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను అధికంగా కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ లను, అంటు వ్యాధులను తగ్గించే శక్తి కూడా ఈ పండ్లకు ఉంది. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నక్క రేగి పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే నొప్పులు, వాపులతో బాధపడే వారు ఈ పండ్లను తరచూ తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే నక్క రేగి పండ్లను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువై ఇబ్బంది పడుతున్నవారు ఈ పండ్లను తినడం వల్ల క్రమ క్రమంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. రోజుకు 10 నుండి 12 ఈ పండ్లను తినడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. గౌట్ సమస్య నుండి బయట పడవచ్చు. అదే విధంగా ఈ చెట్టు ఆకుల్లో నైట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే ఈ నక్క రేగి పండ్లను తినడం వల్ల అల్జీమర్స్ సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది. దీనిలో ఉండే ప్లవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఈ విధంగా నక్కరేగి చెట్టు పండ్లు, ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ పండ్లను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.