Beetroot Juice : చలికాలంలో సహజంగానే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురవుతంటాయి. అయితే జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. మలబద్దకం వస్తుంది. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు కూడా ఈ కాలంలోనే వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. కనుక మనం ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ సమస్యలన్నీ ఈ సీజన్‌లో రాకుండా ఉండాలంటే మనకు ఒకే ఒక్క కూరగాయ ఉపయోగపడుతుంది. దాంతో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఆ కూరగాయ ఏమిటంటే.. బీట్ రూట్.. అవును.. దీంతో మనం అనేక లాభాలను పొందవచ్చు. ఈ సీజన్‌లో మనం రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే ఎన్నో విధాలుగా ప్రయోజనం కలుగుతుంది.
చలికాలంలో మనకు వచ్చే అనేక రకాల సమస్యలను తగ్గించడంలో బీట్‌రూట్ ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని జ్యూస్ గా చేసి తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం కూడా ఉండదు. ఇక చలికాలంలో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త సరఫరా సరిగ్గా జరగక హార్ట్ ఎటాక్‌లు వచ్చే ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే అందులో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
ఇక బీట్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక దీన్ని రోజూ తీసుకుంటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇలా బీట్‌రూట్ మనకు చలికాలంలో ఎంతో మేలు చేస్తుంది. కనుక దీన్ని రోజూ జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌ను నేరుగా తాగలేకపోతే అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు. దీంతో ఎవరైనా సరే ఈ జ్యూస్‌ను సులభంగా తాగేయవచ్చు. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.