Papaya : ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్లను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Papaya : మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. బొప్పాయి మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే ఈ సీజన్‌లో కచ్చితంగా బొప్పాయి పండ్లను తినాలి. దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

Papaya : ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్లను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

బొప్పాయిలోని విటమిన్లు ఎ, సి, కెలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి సహాయ పడతాయి.

బొప్పాయి పండ్లలో నీరు, ఫైబర్‌ అధిక మొత్తంలో ఉంటాయి. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, జింక్‌ ఉంటాయి. ఇవి శక్తిని అందజేస్తాయి.

ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తింటే మనకు రోజులో అవసరం అయ్యే విటమిన్‌ ఎ లో దాదాపుగా 20 శాతం లభిస్తుంది. అదే విటమిన్‌ సి అయితే ఏకంగా 70 శాతం వరకు లభిస్తుంది.

బొప్పాయి పండ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. పైగా ఇందులో ఉండే ఫైబర్‌ బరువు తగ్గించేందుకు సహాయ పడుతుంది.

బొప్పాయి పండ్లను తినడం వల్ల లివర్‌ వ్యాధులు నయమవుతాయి. లివర్‌ శుభ్రంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి, వృద్ధాప్య ఛాయలు రావు. చర్మం యవ్వనంగా ఉంటుంది.

బొప్పాయిలో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ ను నాశనం చేస్తాయి. దీంతో కణాలు సురక్షితంగా ఉండడమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

Share
Admin

Recent Posts