ఎండు ద్రాక్ష.. వీటినే చాలా మంది కిస్మిస్ పండ్లు అని పిలుస్తారు. ద్రాక్షలను ఎండ బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో తయారు చేస్తారు. ఇవి భలే రుచిగా ఉంటాయి. చిన్నారులు ఈ పండ్లను ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే కిస్మిస్ పండ్లను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిస్మిస్ పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినరాదు. అయితే ఇతరులకు ఇవి అధిక శక్తిని అందిస్తాయి. నీరసంగా ఉన్నవారు, బాగా అలసి పోయిన వారు గుప్పెడు కిస్మిస్‌లను తింటే వెంటనే శక్తిని పుంజుకుంటారు. ఉత్సాహంగా మారుతారు. శక్తి లభిస్తుంది. కిస్మిస్ పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.
2. కిస్మిస్ లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు. రాత్రి నిద్రకు ముందు వీటిని తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.
3. కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ సమృద్దిగా ఉంటాయి. అందువల్ల కళ్లు సంరక్షింపబడతాయి. ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
4. ఉప్పును అధికంగా తీసుకోవడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల హైబీపీ వస్తుంది. కానీ కిస్మిస్‌లను తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాలు ప్రశాంతంగా మారుతాయి.
5. కిస్మిస్‌లలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
6. కిస్మిస్ లలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. కిస్మిస్‌లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ క్షణాలు ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
7. ఐరన్ లోపం వల్ల చాలా మందిలో రక్తహీనత సమస్య కనిపిస్తుంటుంది. అలాంటి వారు రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినాలి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య తగ్గుతుంది.
8. కిస్మిస్‌లలో ఓలియానోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంత క్షయం ఏర్పడకుండా రక్షిస్తుంది. దంతాలను, చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో నోట్లో సూక్ష్మ క్రిములు నశిస్తాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
9. కిస్మిస్‌లను తినడం వల్ల పురుషుల్లో అంగ స్తంభన సమస్య పరిష్కారమవుతుంది. వీర్యం నాణ్యత పెరుగుతుంది. దీని వల్ల సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
10. కిస్మిస్‌లను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.
11. కిస్మిస్‌లలో రెస్వెరెట్రాల్ ఉంటుంది. ఇది రక్తంలోని విష కణాలను బయటకు పంపుతుంది. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. దీని వల్ల చర్మ కణాలు దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం ముడతలు పడదు. సాగిపోదు. యవ్వనంగా కనిపిస్తారు. కిస్మిస్‌లను తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365