మిల్క్ షేక్‌లు, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే అరటి పండ్లు, పాలను కాంబినేషనల్ లో తీసుకుంటుంటారు. వేసవిలో ఈ కాంబినేషన్ చాలా పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. దీంతో దాహం తీరడమే కాక తాజాదనపు అనుభూతి కలుగుతుంది. అయితే పాలు, అరటి పండ్ల కాంబినేషన్ ఎంతో రుచిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రెండింటి కాంబినేషన్ మన శరీరానికి మంచిది కాదు. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
అరటి పండ్లు, పాలలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, పొటాషియం, బి విటమిన్లు, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఇక అరటి పండ్లలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి ఉంటాయి. కానీ పాలు, అరటి పండ్లు రెండింటి కాంబినేషన్ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
పాలు, అరటి పండ్ల కాంబినేషన్ శరీరానికి అస్సలు మంచిది కాదు. రెండింటినీ ఒకేసారి తీసుకోవాల్సి వస్తే ఒక్కో దాన్ని తీసుకునేందుకు మధ్య వ్యవధి కనీసం 20 నిమిషాలు ఉండాలి. మొదట పాలను తాగి తరువాత 20 నిమిషాలకు అరటి పండును తినవచ్చు. కానీ పాలు, అరటి పండు కాంబినేషన్‌లో తయారు చేసే మిల్క్ షేక్‌ను అస్సలు తీసుకోరాదు. దీని వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. నిద్రకు భంగం కలుగుతుంది.
అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు పాలు, అరటి పండు కాంబినేషన్‌ను అస్సలు తీసుకోరాదు. ఈ కాంబినేషన్ అధిక బరువు పెరగాలని చూసే వారికి మేలు చేస్తుంది. జిమ్ లకు వెళ్లేవారు కండలు పెంచేందుకు ఈ కాంబినేషన్ పనికొస్తుంది. కానీ అందరికీ మేలు చేయదు.
ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు పాలు, అరటి పండును ఒకేసారి తీసుకోరాదు. తీసుకుంటే శరీరంలో శ్లేష్మం బాగా పెరుగుతుంది. దీంతో శ్వాస సమస్యలు వస్తాయి.
ఇక ఆయుర్వేద ప్రకారం ప్రతి ఆహారానికి ఒక ప్రత్యేకమైన, తన దైన రుచి ఉంటుంది. ప్రతి పదార్థం భిన్న రుచిని, లక్షణాలు, శక్తిని కలిగి ఉంటుంది. వాటిని విడి విడిగానే తీసుకోవాలి. కాంబినేషన్ పనికి రాదు. లేదంటే జీర్ణవ్యవస్థపై అది ప్రభావం చూపిస్తుంది. జీర్ణవ్యవస్థపై ఫుడ్ కాంబినేషన్లు నెగెటివ్ ప్రభావాలను చూపించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, కడుపులో పులియడం, విష పదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఆయుర్వేద ప్రకారం పాలు, అరటి పండు కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. అందువల్ల దాన్ని మానేయాలి. లేదంటే శరీరంలో అగ్ని నాశనం అవుతుంది. దీంతో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇది సైనస్‌కు దారి తీస్తుంది. ముక్కు దిబ్బడ వస్తుంది. దగ్గు, జలుబు, అలర్జీలు వస్తాయి. కనుక పాలు, అరటి పండును ఒకేసారి తీసుకోరాదు. విడి విడిగా కొంత సమయం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365