Raisins : ఎండు ద్రాక్ష.. ఇవి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం చేసే తీపి వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ ఎండు ద్రాక్షలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని పొందవచ్చని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ ఎండు ద్రాక్షను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి… అలాగే వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈఎండు ద్రాక్షను నేరుగా లేదా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించి తీసుకోవడం కంటే వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల వీటిలోని ఉండే పోషకాలను అధికంగా పొందవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో 10 ఎండు ద్రాక్షను వేసి అవి మునిగే వరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన ఎండు ద్రాక్షను రోజూ ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగాలి.
ఇలా చేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఇలా నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వీటిని రోజూ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అలాగే నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు ఈ ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకు వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో ఈ ఎండు ద్రాక్ష మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ ఎండు ద్రాక్ష మనకు ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాల సమస్యలు తొలగిపోతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలతో బాధపడే వారు ఈ ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అధిక రక్తపోటు, నరాల బలహీనత సమస్యతో బాధపడే వారు ఒక గ్లాస్ పాలల్లో 10 ఎండు ద్రాక్షలను వేసి వేడి చేసి తీసుకంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కేవలం ఆరోగ్యానికే కాదు మన అందానికి కూడా ఈ ఎండుద్రాక్ష మేలు చేస్తుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ముడతలు తగ్గి వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని వీటిని అందరూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.