Pistachio Benefits : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో పిస్తా పప్పు ఒకటి. బాదం, జీడిపప్పు లాగే పిస్తాపప్పు కూడా మనకు లభిస్తుంది. వీటిని నేరుగా తినవచ్చు. లేదా రోస్ట్ చేసి తినవచ్చు. నేరుగా తింటే కాస్త చప్పగా ఉన్నట్లు ఉంటాయి. కనుక పెనంపై నెయ్యి వేసి కాస్త ఉప్పు జోడించి వేయించి తింటారు. ఇలా పిస్తా పప్పును తింటే భలే రుచిగా ఉంటుంది. దీన్ని రోజూ తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పిస్తాపప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీదు ఎక్కువైనా సరే పిస్తా పప్పును రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. పిస్తా పప్పు మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.
పిస్తా పప్పును సాయంత్రం సమయంలో తినాలి. సాయంత్రం సమయంలో చాలా మంది నూనెతో చేసిన చిరుతిళ్లను లేదా బేకరీ పదార్థాలను తింటుంటారు. వాటికి బదులుగా పిస్తాపప్పును తినాలి. దీంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పిస్తాపప్పును తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలో ఉండే అనారోగ్యకరమైన కొవ్వును కరిగిస్తాయి. దీంతో శరీరంలోని కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు. రక్తనాళాల్లో ఉండే కొవ్వు పోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తాపప్పును తింటే షుగర్ లెవల్స్ మొత్తం తగ్గుతాయి. ఎందుకంటే వీటిని తినగానే శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా వాడుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ ఆటోమేటిగ్గా కంట్రోల్ అవుతాయి. కనుక షుగర్ ఉన్నవారికి పిస్తా ఎంతగానో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
పిస్తాపప్పులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. పిస్తాపప్పులో ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధుల నుంచి బయట పడవచ్చు. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. బీపీ నియంత్రణలోకి వస్తుంది. పిస్తాపప్పును తింటే జీర్ణాశయంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి విముక్తి లభిస్తుంది. పిస్తాపప్పును తింటే బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక బరువును మేనేజ్ చేసుకోవాలనుకునే వారు రోజూ ఈ పప్పును తినాలి.
అయితే రోస్ట్ చేయబడిన పిస్తాపప్పులో సోడియం అధికంగా ఉంటుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ఇది మంచిది కాదు. కనుక రోస్ట్ చేయబడని, డైరెక్ట్ పిస్తా పప్పునే వీరు తినాలి. అప్పుడు హాని కలగదు. ఇలా పిస్తాపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.