Brinjal : మనకు అందుబాటులో ఉండే అనేక కూరగాయల్లో వంకాయలు ఒకటి. ఇవి పలు భిన్న వెరైటీల్లో మనకు లభిస్తున్నాయి. ఏ రకానికి చెందిన వంకాయలు అయినా సరే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయలను తరచూ తినడం వల్ల ఎన్నో పోషకాలను, ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వంకాయల్లో అనేక రకాల సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు వ్యాధులు రాకుండా చూస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు, ఇన్పెక్షన్లు ఉన్నవారు వంకాయలను తరచూ తింటే అవి త్వరగా మానిపోతాయి. వాపులు కూడా తగ్గుతాయి.
3. గ్యాస్, కీళ్ల నొప్పులు ఉన్నవారికి వంకాయలు ఎంతో మేలు చేస్తాయి. తరచూ వీటిని తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. వంకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
5. వంకాయల్లో ఫైటో న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి మన శరీర కణాలను రక్షిస్తాయి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా చూసుకోవచ్చు.
6. గర్భిణీలు వంకాయలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే పోషకాలు బిడ్డ ఎదుగుదలకు సహాయ పడతాయి.