Samantha : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నిర్మాణమవుతున్న చిత్రం.. శాకుంతలం. ఇందులో సమంత.. శకుంతల పాత్రలో కనిపించనుంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. అయితే ఈ లుక్ అధిక భాగం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు.

గతంలో సమంత నటించిన ఊ అంటావా సాంగ్‌లో ఆమెను చూసి.. ఇప్పుడు దేవకన్యలా ఆమెను ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. అందుకనే ఆమె తాజా లుక్ ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అసలు ఆమె ఫస్ట్ లుక్‌కు సోషల్ మీడియాలోనూ పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇందుకు ఇంకా పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఊ అంటావా పాటలో సమంత గ్లామర్ డోసు మరీ ఎక్కువైంది. అయితే అలాంటి పాత్రలో ఆమెను చూశాక ప్రేక్షకులు మళ్లీ అలాంటి పాత్రలనే చూడాలని కోరుకుంటారు. కనుక ఆమె దేవకన్యలా కనిపించే సరికి చాలా మందికి నచ్చడం లేదు. ఇది శకుంతల ఫస్ట్ లుక్ ఫెయిల్ అవడం వెనుక ఉన్న కారణాలలో ఒకటని అంటున్నారు. అలాగే ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం, మళ్లీ రాత్రికి ఈ చిత్ర ట్రైలర్ విడుదల కావడం.. వంటి సంఘటలన్నీ ప్రేక్షకుల దృష్టిని మరల్చాయి. దీంతో శాకుంతలంలో సమంత ఫస్ట్ లుక్‌కు పెద్దగా స్పందన రాలేదు. అయితే సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఇన్నాళ్లూ గ్లామర్ డోసులో సమంతను చూసిన వారు దేవకన్య లుక్‌లో చూస్తారా.. సినిమాను ఆదరిస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.