కాకరకాయని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అది కాస్త చేదుగా ఉండడంతో తినడానికి ముందుకు రారు. అయితే కాకర రుచి చేదుగా ఉన్నా దీనిలో ఉండే ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దీని జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ కాకరకాయను కొంతమంది మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఒకవేళ తిన్నారంటే అనేక సమస్యలని కొని తెచ్చుకున్నట్టే. టైప్-1 డయాబెటిస్ రోగులు కాకరకాయని అస్సలు తినకూడదు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడే వారు చేదు కూరగానీ లేదా చేదుకాయ రసంగానీ తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా తగ్గిస్తుంది. అప్పుడు బలహీనత మరియు మైకము కలిగించే అవకాశం ఉంది.
గర్భిణీ స్త్రీలు కూడా కాకరకాయని తీసుకోవడం మానుకోవాలి ఎందుకంటే ఇది గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చేదు కాకరకాయలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి దీనిని తినేవారికి కిడ్నీ స్టోన్ సమస్యలు రావచ్చు. అలాగే కాకర మూత్రపిండాలలో విషాన్ని పెంచుతుంది.కాకరకాయ జ్యూస్ ను తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ కాలెయానికి సంబంధించిన వ్యాధులు ఉంటే మాత్రం కాకరకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది కాలేయంలో ఫ్రోటీన్ ప్రసరణను ఆపివేస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాకరని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. వీటిలో డయేరియా ఒకటి. కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వస్తాయి. ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే కాకరకాయను పొరపాటున కూడా తినకండి.
జ్వరం, తలనొప్పి ఉన్న సమయంలో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇలాంటి వాటిలో కాకరకాయ ఒకటి. ఒకవేళ తింటే ఈ రెండు సమస్యలు మరింత పెరుగుతాయి. కాకరకాయలో ఉండే చేదును తగ్గించి, పెద్దగా హాని కలిగించకుండా ఉండాలంటే, సరిగ్గా ఉడికించాలి. అన్నింటిలో మొదటిది, కాకరకాయను బాగా కడగాలి మరియు దాని గింజలను తీసివేయండి, ఎందుకంటే విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి. మీకు కావాలంటే కర్రీలో ఎక్కువ ఉల్లిపాయలను ఉపయోగించవచ్చు. దాని వలన కర్రీ అంత చేదుగా ఉండదు.