Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఏమీ లేని వారికి దేవుడే దిక్కు.. ఆయ‌నే అంద‌రినీ ఆదుకుంటాడు.. చిన్న క‌థ‌..!

Admin by Admin
June 17, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా? నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష!

భయం కలిగినప్పుడల్లా, అన్నా! గోపాలా! అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.. అని ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా! అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, అన్నా! గోపాలా! అని పిలిచాడు. ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు? అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు. పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు.

boy gets courage from god short story

కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడా అందరి లాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించ మన్నారు. చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని అయ్యవారు ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు. ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్లీ పెరుగు నిండిపోయింది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, అద్భుతం! అమోఘం! ఈ పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు? అన్నాడు. వేరే వాళ్ళంతా, యేది, మాకు వడ్డించండి, మేమూ చూస్తాము, అన్నారు.

అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా, అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది. వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ యేది, అన్నా! గోపాలా! అని పిలూ, మేమూ చూస్తాము! అన్నారు. అయ్యవారు అందరిని మందలించారు. మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.. అన్నారు. అందరూ ఆకాశం వైపు చూశారు.

Tags: boygod
Previous Post

గుర‌క స‌మ‌స్య అస‌లు ఎందుకు వ‌స్తుంది..? ఇది త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

Next Post

పల్లీలు తిని నీటిని తాగరాదు…ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే..! తప్పక తెలుసుకోండి.!

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

July 9, 2025
lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.