Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

గుర‌క స‌మ‌స్య అస‌లు ఎందుకు వ‌స్తుంది..? ఇది త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

Admin by Admin
June 17, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. అంతటి విలువైన నిద్రకు భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి. గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చు. తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడే వారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకొనిపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది.

మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది. గురకని గుర్తించే కొన్ని మార్గాలు.. నోరు మూసుకొని గురకపెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం. నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలి.

why snoring happens and ways to reduce it

విముక్తికి గృహ వైద్యం.. గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి. కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది. అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది. అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. 2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.

Tags: snoring
Previous Post

జ్యోతిష శాస్త్రం ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఏ రోజు ఏ ఆహారం తినాలంటే..?

Next Post

ఏమీ లేని వారికి దేవుడే దిక్కు.. ఆయ‌నే అంద‌రినీ ఆదుకుంటాడు.. చిన్న క‌థ‌..!

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.