నేను కారు కొనే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను. మీకు చెప్తాను ఉపయోగపడతాయేమో.. మీరు రోజూ వాడతారా? –అయితే కొనుక్కోవచ్చు. వాడితే ఎన్ని కిలోమీటర్లు? — ఇరవై దాటితే కొనుకోవచ్చు. దగ్గర్లో ప్రజా రవాణా ఉందా? — ఉంటే అక్కర్లేదు. ఎంత మంది ప్రయాణిస్తారు? — ఒక్కరే అయితే అక్కర్లేదు. మీకు ఏదైనా శ్వాస కి సంబంధించిన అనారోగ్యం ఉందా? — అయితే కొనుకోవచ్చు.
మీ జీతం ఎంత? — నెలకు 60 వేలుకు పైన ఐతే చాలా చిన్న కారు(<5 లక్షలు), లక్ష పైన ఉంటె (<8 లక్షలు), రెండు లక్షల దాదాపు ఉంటె (12 లక్షలు) కారు కొనవచ్చు.
ఎంత డబ్బు దాచారు? — సగానికి పైగా దాస్తే కొనుకోవచ్చు లేదంటే దాచాక ప్రయత్నం మొదలు పెట్టండి. మీకోసం కొంటున్నారా? జనల మెప్పు గురించా? — రెండవది ఐతే వద్దు. ఇలా ఎవరికి వారు ప్రశ్నలను వేసుకుంటే కారు కొనాలా, వద్దా అన్న ప్రశ్నకు మీకే సమాధానం లభిస్తుంది.