సినిమావాళ్ళకు, రాజకీయాలకు కొంచెం కులగజ్జి అంటించారు కానీ టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా ఎలా అయిన నెట్టుకొస్తాడు అని చెప్పడానికి రాజామౌళి జీవితం, అతని మీద వచ్చిన ఈ డాక్యుమెంటరీ నిదర్శనం. ఎప్పుడో ఒక పాత ఇంటర్వ్యూ లో నాకు బాగా నచ్చిన తన మాట. డబ్బు ఉండి సినిమా మీద ఇష్టం లేనివాడు నాకు ప్రొడ్యూసర్ గా వద్దు అలాగే ఇష్టం ఉంది డబ్బు లేనివాడు ఉపయోగం లేదు. సినిమా అంతే పిచ్చి ఉండి అంత డబ్బు పెట్టగలిగేవాడే నాకు అవసరం అని.
ఈ రోజు ఈ ఎపిసోడ్ లో బాగా నచ్చిన ఒక విషయం, బాహుబలి 1 బడ్జెట్ అనుకోకుండా విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్టాఫ్ అందరికీ వెజిటేరియన్ భోజనాలు, టాప్ 10 నటులకు మినహా తనుకూడా అందరిలాగే బాత్రూమ్ కూడా సరిగా లేని ఒక చీప్ లాడ్జ్ లో బస, ఫామిలి అందరూ ఒకే చిన్న కారులో వెళ్ళి రావడం. తన సినిమా కోసం తను ఎంత కష్టం అయినా సరే ఐదేళ్లు అదే పాషన్ తో నడిపించుకుంటూ రావడం, తనకు నచ్చేలా అందరినీ మలచుకోవడం, ఈ కారణాల వలన ఎస్ఎస్ఆర్ అన్నది ఒక బ్రాండ్ మార్క్ గా ప్రపంచం గుర్తించే స్థాయికి వెళ్ళాడు.
పదేళ్ళు ఎడిటింగ్, ఐదుఏళ్లు డైరెక్షన్, 500 ఎపిసోడ్స్ ఉన్న సీరియల్, ఒక చిన్న మొదటి సినిమా ఇన్ని దాటితే కానీ సింహాద్రి వంటి సినిమా అందుకోలేకపోయాడు. ఓపిక, నైపుణ్యం, అనుభవం ఉండాలి అనేది అందుకే. అందరూ ఒకసారి చూడండి, రాజామౌళి లో తెలియని కొత్తకోణాలు ఈ ప్రోగ్రామ్ లో కనిపించాయి.