Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

క‌థ చెబుతున్న నీతి.. అస‌లు వీరిలో త‌ప్పు ఎవ‌రిది.. తెలిస్తే చెప్పండి..!

Admin by Admin
June 29, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తిలాపాపం తలాపిడికెడు. ఒక గద్ద ఒక పామును ఆహారంగా తన్నుకుని పోతూంది. చావుకి దగ్గరగా ఉన్న పాము తన కోరల్లో ఉన్న విషాన్ని వదలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ యొక్క తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లభామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి ఆబ్దీకానికి భోక్త గా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనం లో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు. మిగిలిన పితృ శేషం తిన్న బ్రాహ్మణుడూ కూడా మరణించాడు. దీనికంతా ముందే.. పాము మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు గారి దగ్గర విచారణ ప్రారంభమయింది.

ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాసేడు, చిత్రగుప్తుడు. బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు, చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు ధర్మ ప్రభో! ఇది అన్యాయం. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు, నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టేను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు. పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో, అన్నాడు. గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేసేవు కనక అంటే, బాబోయ్…! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది.

who did mistake in this story

గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని, గాలిని పిలిచారు. గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ, అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు, పాముని. పాము, ధర్మ ప్రభూ..! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకేతెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు కనక, తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది. అప్పుడు ఇక మిగిలింది గద్ద కనక, గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో..! పాము నా అహారం, గగన విహారం నాలక్షణం, పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు, అందు చేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మ రాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా. అప్పుడు సమవర్తి, చిత్రగుప్తుడిని, ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు.

చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయంమీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామ తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణునిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు. మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయంగురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతయినా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు.

Tags: Eagle
Previous Post

ఇవాంక ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? చూస్తే తండ్రికి తగ్గ కూతురు అంటారు.!

Next Post

జ‌పాన్‌లో టీచ‌ర్స్ డే ఉండ‌దు తెలుసా..? ఎందుకంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.