Off Beat

అమెరికాలో 4 రెక్కల ఫ్యాన్, ఇండియాలో 3 రెక్కల ఫ్యాన్ ను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఫ్యాన్ అనగానే మూడు రెక్కలుంటాయ్…1 నుండి 5 వరకు స్పీడ్ ను అప్ గ్రేడ్ చేసే స్విచ్ ఉంటుంది…అని మనమైండ్ లో ఓ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కానీ మన ఫ్యాన్ లకు మూడు రెక్కలుంటే, అమెరికాలో మాత్రం నాలుగు రెక్కలుంటాయి. ఇప్పుడిప్పుడు మన దగ్గర కూడా కొన్ని ఫ్యాన్స్ కు నాలుగు రెక్కలున్నప్పటికీ చాలా వాటికి మూడు రెక్కలే ఉంటాయి, అమెరికా లో మాత్రం నాలుగు రెక్కల ఫ్యాన్సే ఉంటాయ్. దానికి గల కారణం ఏంటో తెలుసా?

అమెరికాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అందుకని నాలుగు రెక్కల ఫ్యాన్ ను వాడుతారు. ఇలా నాలుగు రెక్కల ఫ్యాన్ కు, చలి తీవ్రతకు సంబధం ఏమిటంటే.. నాలుగు రెక్కల ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఫ్యాన్ నుండి గాలి తక్కువగా వస్తుంది, ఆ గాలి కూడా వేడిగా ఉంటుంది, కాబట్టి నాలుగు రెక్కల ఫ్యాన్ ను చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాడతారు.

why indian ceiling fans have 3 blades

అదే మనదేశంలో చలితీవ్రత అంతగా ఉండదు, అందువల్ల మనం మూడు రెక్కల ఫ్యాన్ ను వాడతాం.మూడు రెక్కల ఫ్యాన్ నుండి గాలి ఎక్కువగా వీచడంతో పాటు చల్లటి గాలి వస్తుంది. అందుకే మనదేశంలో మూడు రెక్కల ఫ్యాన్, అమెరికాలో నాలుగు రెక్కల ఫ్యాన్ వాడుతారు. అంతే సింపుల్ లాజిక్…!

Admin

Recent Posts