Jilledu : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధ ఒకటి. మారిన జీవన విధానం, ఆరోగ్యపు అలవాట్లే మనల్ని ఈ వ్యాధి బారిన పడేలా చేస్తున్నాయి. షుగర్ వ్యాధి కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. పెద్దలే కాకుండా యువత కూడా ఈ వ్యాధి బారిన పడడం ఆందోళనకు గురి చేస్తుంది. షుగర్ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాలి. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికి షుగర్ వ్యాధి అనేది నియంత్రణలోకి రాదు. ఇలాంటి ఆయుర్వేదం ద్వారా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండే ఈ ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి అదుపులోకి రాక ఇబ్బందులు పడే వారు జిల్లేడు ఆకులను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. జిల్లేడు చెట్టు మనందరికి తెలిసిందే. దీనిలో ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం కూడా మనలో చాలా మందికి తెలుసు. కానీ జిల్లేడు ఆకులను ఉపయోగించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. జిల్లేడులో తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు అని మూడు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడును మాత్రమే మనం షుగర్ వ్యాధి నియంత్రణ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ ఆకులను ఉపయోగించడం వల్ల వారం రోజుల్లోనే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లేడు ఆకులను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతున్నారు. జిల్లేడు పాలు కళ్లల్లో పడకుండా అలాగే ఆకులను పట్టుకున్న తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ చిట్కాను వాడకపోవడమే మంచిది. షుగర్ వ్యాధితో బాధపడే వారు జిల్లేడు ఆకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక జిల్లేడు ఆకును శుభ్రంగా కడగాలి. తరువాత ఈ ఆకు పైభాగం పాదం కింది భాగానికి తాకేలా ఉంచి దారంతో కట్టాలి. పాదం పెద్దగా ఉన్న వారు రెండు ఆకులను ఉపయోగించవచ్చు. ఇలా రెండు పాదాలకు కూడా జిల్లేడు ఆకులను కట్టుకోవాలి.
తరువాత వీటి పై నుండి సాక్స్ ను ధరించాలి. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంచుకోవాలి. ఉదయం పూట కుదరని వారు రాత్రి పడుకునే ముందు పాదాలకు కట్టుకుని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం పూట ఆకులను తిసేసి పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయాలి. అలాగే ఏ రోజు ఆకులను ఆ రోజే ఉపయోగించాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేయడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో మార్పు రావడాన్ని గమనించవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా జిల్లేడు ఆకులను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.