Pulipirlu : మనలో కొందరు పులిపిర్లతో బాధపడుతుంటారు. ఈ పులిపిర్లు ఎక్కువగా మెడ భాగం, చేతి వేళ్లపై, కనుబొమ్మలపై, చంక ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి హానీ కలగనప్పటికీ ఇవి చూడడానికి అందవిహీనంగా కనబడతాయి. వీటిని తొలగించడానికి రకరకాల అయింట్ మెంట్లను రాస్తూ ఉంటారు. మందులను కూడా వాడుతుంటారు. కొందరు వీటిని కట్ చేస్తుంటారు. అయినా కూడా పులిపిర్ల సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు కలిగిన రెడ్డి వారి నానుబాలు మొక్కను ఉపయోగించి మనం పులిపిర్ల సమస్య నుండి బయటపడవచ్చు. ఈ మొక్కను పాలకాడ, పచ్చ బొట్లాకు, నాగార్జుని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క మనకు పంటపొలాల దగ్గర ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రెడ్డి వారి నానుబాలు మొక్క చాలా చిన్నగా ఉంటుంది. ఈ మొక్క ఆకులను, కాండాన్ని తుంచినప్పుడు పాలు కూడా వస్తాయి. ఈ పాలు మనకు పులిపిర్లను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ మొక్క పాలను పులిపిర్లపై పూతగా రాయడం వల్ల పులిపిర్లు వాటికవే రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల పులిపిర్ల సమస్య నుండి మనం బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు.
కంటి చూపును మెరుగుపరచడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొక్క పాలను కంట్లో రెండు చుక్కల చొప్పున వేసుకోవడం వల్ల కంటి పొరలు, కళ్లు మసకగా కనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. సంతానాన్ని కలిగించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. మహిళలలో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలన్నింటినీ తగ్గించి సంతానం కలిగేలా చేయడంలో ఈ మొక్క సహాయపడుతుంది.
మహిళలు నెలసరి వచ్చిన మొదటి రోజులు ఈ మొక్క మొత్తాన్ని మెత్తగా దంచి రసాన్ని తీసి దానికి 9 మిరియాల చూర్ణాన్ని కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గి సంతానం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గాయాలపై ఈ మొక్క నుండి వచ్చిన పాలను రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. మొటిమలను తగ్గించడంలోనూ ఈ మొక్క పాలు సహాయపడతాయి. ఈ విధంగా రెడ్డి వారి నానుబాలు మొక్కను ఉపయోగించి మనకు వచ్చే వివిధ రకాల సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.