Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Plants : ఈ మొక్క‌ల‌ను ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..

D by D
September 9, 2022
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Plants : మ‌నం ఇంట్లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔష‌ధ మొక్క‌లు కూడా ఉంటాయి. వాటి వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క వాటిని ఉప‌యోగించుకోలేక‌పోతుంటారు. మ‌నం ఇంట్లో పెంచుకునే కొన్ని ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఔష‌ధ మొక్క‌లు హానిర‌హిత‌మైన‌వి. వీటిని పెంచుకోవ‌డం వ‌ల్ల అలాగే వాడ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను వ్యాధి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించాలి. ప‌రిస్థితులు విష‌మంగా ఉన్న‌ప్పుడు వీటి మీద ఆధార‌ప‌డ‌కుండా వైద్యున్ని సంప్ర‌దించ‌డం చాలా ముఖ్యం.

ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే కొన్ని ఔష‌ధ మొక్క‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందూ సంప్ర‌దాయంలో ఈ మొక్క‌కు ఎంతో విశిష్టత ఉంటుంది. తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఆకుల‌ను నేరుగా లేదా క‌షాయంగా చేసుకుని తీసుకోవ‌చ్చు. తుల‌సి మొక్క‌లో రామ తుల‌సి, కృష్ణ తుల‌సి, క‌ర్పూర తుల‌సి, వాన తుల‌సి వంటి నాలుగు ర‌కాలు ఉంటాయి. క‌ర్పూర తుల‌సిని ఎక్కువ‌గా బాహ్య ప్ర‌యోజ‌నాల కోసం వాడుతూ ఉంటారు.

we must grow these Plants at home for many benefits
Plants

క‌ర్పూర తుల‌సి నుండి తీసిన నూనెను చెవి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగిస్తారు. తుల‌సిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైరల్ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి. శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో కూడా తుల‌సి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. జ్వ‌రం, సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో రామ తుల‌సిని ఎక్కువ‌గా వాడ‌తారు. తుల‌సి మ‌లేరియాను న‌యం చేయ‌డంలో కూడా చాలా ప్ర‌భావవంతంగా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా అజీర్తి, త‌ల‌నొప్పి, నిద్ర‌లేమి, మూర్ఛ, క‌ల‌రా వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా తుల‌సి మ‌న‌కు స‌హాయ‌పడుతుంది.

ఇక ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతోపాటు ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో మెంతి కూడా ఒక‌టి. మొంతి ఆకుల‌తోపాటు మెంతులు కూడా పోష‌క విలువ‌ల‌ను, ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఎలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనైనా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. శ‌రీరంలో అధికంగా ఉన్న వేడిని త‌గ్గించ‌డంలో మెంతి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. మెంతిలో కాలేయ క్యాన్స‌ర్ ను అరిక‌ట్టే గుణం మెండుగా ఉంటుంది. బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచే శ‌క్తి కూడా మెంతికి ఉంది. క‌డుపులో మంట‌, అల్సర్ వంటి వాటి చికిత్స‌లో కూడా మెంతిని ఉప‌యోగిస్తారు. ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించే గుణం కూడా దీనికి ఉంది. చెడు గాలిని తొల‌గించి మంచి గాలిని అందించ‌డంలో కూడా మెంతి మ‌న‌కు తోడ్ప‌డుతుంది. ఇది అంద‌రి ఇండ్ల‌ల్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన మొక్క అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంట్లో సుల‌భంగా పెంచుకునే మొక్క‌లల్లో నిమ్మ‌చెట్టు కూడా ఒక‌టి. దీనిని కుండీలో కూడా పెంచుకోవ‌చ్చు. నిమ్మ మొక్క‌లో కూడా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దీనిని టీ, స‌లాడ్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు. ఒత్తిడిని, న‌రాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో, అధిక ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో నిమ్మ ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జ్వ‌రాన్ని, గొంతు ఇన్ ఫెక్ష‌న్ ల‌ను, కొన్ని ర‌కాల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, కండ‌రాల నొప్పుల‌ను, కీళ్ల నొప్పులను, క‌డుపు నొప్పిని త‌గ్గిండ‌చంలో కూడా దీనిని వాడుకోవ‌చ్చు.

క‌ల‌బంద‌.. ఇది దాదాపు అంద‌రి ఇండ్లల్లో ఉండే ఉంటుంది. ఇది ఒక అద్బుతమైన మొక్క‌. ఎక్కడైనా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ఇది పెర‌గ‌డానికి మంచి సూర్య‌కాంతి అవ‌స‌రం. ఇండ్ల‌ల్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన మొక్క‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. దీనిని బాహ్య అవ‌స‌రాల‌కు, అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా క‌లబంద‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. క‌ల‌బంద‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. పైన తెలిపిన మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల త‌ర‌చూ వైద్యుని వ‌ద్ద‌కు వెళ్లే ప‌ని లేకుండా మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం ఇంట్లోనే న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: plants
Previous Post

Apple Halwa : యాపిల్‌ పండ్లతో రుచికరమైన హల్వా తయారీ ఇలా..!

Next Post

Bellam Gavvalu : బెల్లం గ‌వ్వ‌ల‌ను ఇలా చేస్తే.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..

Related Posts

ఆధ్యాత్మికం

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన ఈ 10 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

July 12, 2025
ఆధ్యాత్మికం

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని తొలుత ఎవ‌రు ద‌ర్శించుకుంటారో తెలుసా..?

July 12, 2025
ఆధ్యాత్మికం

పితృ ప‌క్షాలు అంటే ఏమిటి..? వాటి వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి..?

July 12, 2025
వ్యాయామం

ఎక్స‌ర్‌సైజ్ చేసే వారు స‌డెన్‌గా దాన్ని ఆపేస్తే… లావై పోతారా? ఇందులో నిజమెంత??

July 12, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు?.. 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.