Chapati : చాలామంది చపాతీలని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదయం పూట, రాత్రిపూట కూడా చపాతీలను చాలా మంది తింటూ ఉంటారు. చపాతీలని రాత్రి తీసుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. లేదంటే, అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాత్రిపూట భోజనం తిన్న తర్వాత, వెంటనే నిద్ర పోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం గంటన్నర తర్వాత నిద్ర పొమ్మని అంటున్నారు. రాత్రిపూట అన్నం తింటే, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని, బరువు పెరిగిపోతారని చాలా మంది అన్నం తినడం మానేసి, చపాతీలను తింటూ ఉంటారు.
పైగా, చపాతీలు నిల్వ చేసుకుని తింటే ఇంకా ఆరోగ్యం. ఉదయం చేసుకున్న చపాతీలని రాత్రి తీసుకున్నా కూడా, ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. చపాతీలు అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. అందువలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు. రాత్రివేళ జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందుకని, రాత్రి పూట చపాతీలు తింటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు, చపాతీలను కాల్చేటప్పుడు ఎక్కువ నూనె వేసుకుని కాల్చవద్దు. రాత్రిపూట చపాతీలను తింటే ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుంది.
అన్నం తినడం కంటే, చపాతీలు తింటే బాగా ఎనర్జీ వస్తుంది. గోధుమలలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గుండెకి కూడా మేలు కలుగుతుంది. చపాతీలు తిన్నాక కూడా గంటన్నర తర్వాతే నిద్ర పోవాలి అని గుర్తు పెట్టుకోండి.
రాత్రిపూట ఏడు తర్వాత తినేయండి. 10 దాటిన తర్వాత అస్సలు తినకండి. చపాతీలో కూరగా బంగాళాదుంప కూరని చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ బంగాళదుంపని తినడం వలన ఆరోగ్యానికి నష్టాలు కలుగుతాయి. చపాతీలను రాత్రిపూట తినేవాళ్ళు, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. లేదంటే, అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.