వేసవిలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకుంటుంటారు. అలాంటి పదార్థాల్లో పెరుగు మొదటి స్థానంలో నిలుస్తుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. పెరుగును తినడం వల్ల జీర్ణాశయంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇది దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగును తినే విషయంలోనూ పలు నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తినరాదు. కానీ దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటంటే..
1. ఆయుర్వేద ప్రకారం పెరుగును రాత్రి పూట తినడం వల్ల మ్యూకస్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల రాత్రి పూట పెరుగును తినరాదు. తరచూ దగ్గు, జలుబు వచ్చే వారు అయితే పెరుగును రాత్రి పూట అస్సలు తినరాదు. కానీ పలుచని మజ్జిగను సాధారణ వ్యక్తులు తీసుకోవచ్చు.
2. పగటి పూట పెరుగును తింటే అందులో చక్కెర కలిపి తింటే మంచిది. రాత్రి పూట పెరుగును తినదలిస్తే అందులో మిరియాల పొడి కలిపి తినాలి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
3. పెరుగును అస్సలు వేడి చేయరాదు. కొందరు దీన్ని వేడి చేసి ఇతర పదార్థాలతో కలిపి తింటారు. అలా చేయరాదు.
4. పెరుగును తినదలచిన వారు పెరుగన్న తింటే మంచిది. శరీరానికి మేలు జరుగుతుంది.
5. పెరుగులో చక్కెర కలుపుకుని తినవచ్చు. మజ్జిగ అయితే అందులో ఉల్లిపాయలు, జీలకర్ర, కీరదోస, టమాటాలను కలిపి తీసుకోవచ్చు.
6. మజ్జిగలో శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని అన్నంతో తీసుకోవాలి. బ్రౌన్ రైస్‌తో దాన్ని తింటే ఇంకా మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365