Brown Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది సంప్రదాయ తెల్ల బియ్యానికి బదులుగా రకరకాల ఆహారాలను తింటున్నారు. చిరుధాన్యాలతోపాటు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. ఇలా రకరకాల ధాన్యాలను తీసుకుంటున్నారు. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే చాలా మంది బ్రౌన్ రైస్‌ను తింటారు కనుక దాన్ని రోజులో ఏ సమయంలో తినాలో తెలియక సందేహిస్తుంటారు. బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ రైస్‌ను తింటే త్వరగా జీర్ణం కాదు. సమయం పడుతుంది. కాబట్టి రాత్రి పూట ఈ రైస్‌ను తినకూడదు. రాత్రి ఈ రైస్‌ను తింటే జీర్ణ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక రాత్రి పూట బ్రౌన్ రైస్‌ను తినరాదు.
ఇక ఉదయం మన శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి. కానీ బ్రౌన్ రైస్‌ను తింటే రక్తంలో షుగర్ స్థాయిలు వెంటనే పెరగవు. దీంతో శక్తి రాదు. కనుక ఉదయం కూడా బ్రైన్ రైస్‌ను తీసుకోరాదు. కేవలం మధ్యాహ్నం సమయం మాత్రమే దీన్ని తినేందుకు అనువైనది. ఆ సమయంలో తింటేనే రాత్రి వరకు పూర్తిగా జీర్ణమవుతుంది. పైగా మధ్యాహ్నం లంచ్ తరువాత స్నాక్స్ సమయంలో ఇతర పదార్థాల వైపుకు దృష్టి పోదు. దీంతో చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ను తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది. కనుక బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నమే తినాలి.
బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీంతో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అలాగే శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కనుక జీర్ణ సమస్యలు ఉండవు. ఇలా బ్రౌన్ రైస్‌తో అనేక లాభాలను పొందవచ్చు.