ఖర్జూరాలను తినడం వల్ల శక్తి అధికంగా లభిస్తుంది. దీంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాలను అతిగా తింటే వేడి చేస్తాయి. కనుక వాటిని రోజుకు 4-5 తినాలి. అయితే ఖర్జూరాలను ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు తింటే మంచిదని చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. కొందరు వాటిని రాత్రి నిద్రకు ముందు తినవచ్చా, లేదా అని ప్రశ్నిస్తుంటారు. మరి ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలను తెలుసుకుందామా..!
ఖర్జూరాలను ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా తినవచ్చు. కానీ భోజనం చేసిన వెంటేనే వాటిని తినరాదు. ఎందుకంటే ఖర్జూరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. భోజనం చేసిన వెంటనే ఖర్జూరాలను తినడం వల్ల వాటిలోని ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించలేదు. అందువల్ల కనీసం 2 గంటల వ్యవధితో వాటిని తినాలి.
ఇక ఉదయం పూట తినదలుచుకుంటే ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నీటిలో నానబెట్టడం మంచిది. అదే రాత్రి తింటే ఉదయం నీటిలో నానబెట్టాలి. రాత్రి నిద్రకు ముందు తినాలి. రోజుకు రెండు సార్లు తింటే 3 చొప్పున ఖర్జూరాలను తినవచ్చు. ఒకేసారి తింటే 4-5 తినాలి.
ఉదయం అల్పాహారం చేయడానికి 30 నిమిషాల ముందు ఖర్జూరాలను తినాలి. రాత్రి నిద్రకు ముందు తినాలి. రాత్రి భోజనానికి, ఖర్జూరాలను తినడానికి మధ్య సమయం 2 గంటలు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఖర్జూరాలను తినాల్సి ఉంటుంది.
ఖర్జూరాలను తినడం వల్ల అధికంగా శక్తి లభిస్తుంది. ఉదయం తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ అది సహజసిద్ధమైన చక్కెర. అందువల్ల బరువు పెరగరు. ఖర్జూరాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల ఖర్జూరాలను అనువైన సమయంలోనే తినాలి. దీంతో ప్రయోజనాలను పొందుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365