అమెరికాలో మరణాలకు ప్రధానంగా కరోనరీ గుండె జబ్బులే కారణమని ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ నిపుణులు జారీ చేసిన నివేదికలో వెల్లడైంది. అమెరికాలో గుండెజబ్బుల వైద్యం కొరకు వైద్యులను సంప్రదించిన కేసులు 6.7 శాతం నుండి 6 శాతంకు పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ తగ్గుదలకు కారణం పొగతాగేవారు, రక్తపోటు రోగులు,కొల్లెస్టరాల్ అధికంగా వున్నవారు తగ్గటం కావచ్చునంటున్నారు పరిశోధకులు.
తగ్గుదల ఈ విధంగా వున్నప్పటికి అమెరికా దేశంలో మరణాలు అధికంగా గుండె జబ్బులవలన జరుగుతున్నాయని, 65 సంవత్సరాల పైపడిన వారు ఈ జబ్బులతో మరణిస్తున్నారని తెలుపుతున్నారు. మీరు ఎక్కడ జీవిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారనేది గుండె పరిస్ధితి తెలుపుతుంది. రాబోయే అయిదు సంవత్సరాలలో 1 మిలియన్ గుండె పోట్లను నివారించటానికి ప్రజలు వారంతవారే చర్యలు ఎలా చేపట్టాలి?
వ్యాపార వర్గాలు, ఇతర సంస్ధలు, ఆరోగ్య సంబంధిత శాఖలు వారికి ఎలా సహకరించాలనే అంశాన్ని కరోనరీ డిసీజ్ సెంటర్ డైరెక్టర్ ధామస్ ఆర్ ఫ్రీడెన్ వివరించారు. గుండెజబ్బు రిస్కు వున్న వారికి యాస్ప్రిన్ బాగా పని చేస్తోందని అయితే దీనిని కొద్దిమంది మాత్రమే ఆచరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అధ్యయనాన్ని మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్ధ ప్రచురించింది.