ప్రతిరోజూ రెండే గ్లాసుల బీరు తాగితే, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయట. రీసెర్చర్లు ప్రపపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది బీరు తాగేవారి అలవాట్లను స్టడీ చేశారట. బీరు కూడా వైన్ వలెనే ప్రతిరోజూ కొద్దిపాటిగా అంటే రెండు గ్లాసులు మాత్రమే తాగే వారికి గుండెజబ్బుల సమస్యలు 31 శాతం తగ్గినట్లు కనుగొన్నారు.
బీరు అసలు ఆరోగ్యానికి ఎందుకు మంచిది? అంటే…బీరులో వాస్తవంగా వుండేది కొవ్వు, పీచు లేని స్వచ్ఛమైన ప్రొటీన్లు. వాటితోపాటుగా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం మరియు బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ వుంటాయి. ఫోలిక్ యాసిడ్ రక్తంలోని హోమోసిస్టీన్ స్ధాయి తగ్గిస్తుంది.
హోమోసిస్టీన్ స్ధాయి అధికంగా వుంటే, అది గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తుంది. బీర్ లో రెడ్ వైన్ లో వలెనే సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి.ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడతాయి. కనుక ప్రతిరోజూ రెండు గ్లాసుల బీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులంటారు. అయితే అధిక బరువు ఉన్నవారు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు బీర్ తాగకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.