ప్రపంచ దేశాలలో చాలా దేశాలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతాయి. కొంతమంది క్రికెటర్లు వారి టాలెంట్ తో ఎంతో పేరు తెచ్చుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఎన్నో ఆటలు ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. వారు ఏ విధంగా పేరు సంపాదించుకున్నారో, ఆ విధంగానే వారి యొక్క ఆస్తులు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా భారత క్రికెటర్లలో అత్యధిక ధనవంతులైన క్రికెటర్లు, వారి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఎప్పుడు చూద్దాం.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ గంభీర్. ఈయన మొత్తం ఆస్తుల విలువ 147 కోట్లు. ఈయన ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నారు. ఈయన సారథ్యంలోనే ఇటీవలే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించింది.
రోహిత్ శర్మ.. ఆస్తుల విలువ 160 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. రాహుల్ ద్రావిడ్ ఆస్తుల విలువ కూడా ఎక్కువగానే ఉందట. దాదాపుగా 172 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. క్రికెట్ అభిమానుల్లో సురేష్ రైనా అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఆస్తుల విలువ కూడా 185 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. యువరాజ్ సింగ్ ఆస్తుల విలువ కూడా 255 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
క్రికెట్ చరిత్రలోనే ఎంతో పేరు సంపాదించుకున్న ఆటగాడు వీరేంద్రసెహ్వాగ్. ఈయన ఆస్తులు విలువ మొత్తం 286 కోట్లకు పై మాటే. స్టార్ క్రికెట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకున్న సౌరవ్ గంగూలీ 365 కోట్లకు వారసుడట. విరాట్ కోహ్లీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఈయనకు క్రికెట్ కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదన ఉంటుంది. దాదాపుగా 770 కోట్ల పైగా కోహ్లికి ఆస్తులు ఉన్నాయని సమాచారం. క్రికెట్ చరిత్రలోనే ఎనలేని పేరు సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోని ఆస్తుల విలువ 785 కోట్లు ఉంటుందట. క్రికెట్ దేవుడిగా పేరు సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ 1110 కోట్ల పై మాటే ఉంటుందట.