ఇండియాలో క్రికెట్ ను ఓ మతంగా చూస్తారు. క్రికెట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే.. ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూనే ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే… ఇంటర్నేషనల్ క్రికెట్ లో….ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ…70 టెస్ట్ లు, 63 ODI లు ఆడాడు….సింగిల్ నో బాల్ కూడా వేయలేదు. ఇండియాకు మొదటి వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన కెప్టెన్…కపిల్ దేవ్…131 టెస్ట్ లు, 225 ODI లు ఆడాడు. ఈయన కూడా ఒక్క నో బాల్ కూడా వేయలేదు. వెస్టిండీస్ స్పిన్నర్ లాన్స్ గిబ్స్….79 టెస్టులు, 3 ODI లు ఆడిన గిబ్స్ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 300 వికెట్లు ఫాస్ట్ గా తీసిన బౌలర్ కూడా ఇతనే.
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఈయాన్ బోధమ్…102 టెస్టులు 116 ODI లు ఆడాడు. ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 175 ODI లు 88 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక్క నోబాల్ వేయలేదు. ఈయన కూడా ఫాస్ట్ బౌలరే.