ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ అయిపోతున్నారు. ఏమైనా పనులు చేసుకోవడానికి కూడా సమయం ఉండట్లేదు. ముఖ్యంగా ఇంటి పనులతో విసిగిపోతున్నారు, ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. పైగా పనిమనిషిని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇంటిని బాగా క్లీన్ చేస్తుంది. డ్రీం టెక్నాలజీస్, ఫ్లాట్ షిప్ రోబోట్ వ్యాక్యూమ్ అలాగే మాప్. ఇక నుంచి ఆడవాళ్ళకి చాలా పనిని ఇది తగ్గిస్తుంది. డ్రీం ఎక్స్ పార్టీ అల్ట్రా మాప్ అద్భుతంగా పనిచేస్తుంది. పైగా ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా మనం దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్ ఫీచర్స్ తో ఇది వచ్చేసింది. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం.. డ్రీమ్ X40 అల్ట్రా AI-ఆధారిత మ్యాపింగ్ మ్యాపింగ్, ఈజీగా ఏదైనా వస్తువు వస్తే పక్కకు జరగగలుగుతుంది.
వాక్యూమ్ క్లీనర్ సైడ్ రీచ్ టెక్నాలజీ, మోపెక్సిడెంట్, రోబో స్వింగ్ టెక్నాలజీ, వోర్మాక్స్ సక్షన్, 7-ఇన్-1 ఆటో బేస్ స్టేషన్, కార్పెట్ క్లీనింగ్ తో వచ్చేసింది. డ్రీమ్ X40 అల్ట్రా ధర వచ్చేసి రూ. 1,29,999 గా ఉంది. అయితే, దీపావళి ఆఫర్లలో రూ.99,999 కి కొనుగోలు చెయ్యొచ్చు. ఇది అమెజాన్‌లో, డ్రీమ్ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 26 నుండి ఆఫర్ లో తీసుకోవచ్చు.