మనకు కంప్యూటర్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంట. అసలే ఈ మధ్య చిన్న పిల్లలతో మొదలెడితే పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఉపయోగించేస్తున్నారు. మనం ఎన్నో రోజులనుండి అది ఉపయోగిస్తున్న కొన్ని విషయాలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ఒకవేళ మీరు గనక కంప్యూటర్ ఎప్పటినుండో వాడుతుంటే మీకోసం ఇక్కడో ప్రశ్న ఉంది. సమాధానం చెప్పగలరేమో చూడండి!
కంప్యూటర్ ఆన్ చేయగానే…డెస్క్ టాప్ మీద రిఫ్రెష్ ఎందుకు క్లిక్ చేస్తాము..? సిస్టం ఆన్ అవ్వగానే రిఫ్రెష్ చేయడం మనకి ఎప్పటినుండో అలవాటు అయిపొయింది. మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ కొడతాం..లేకుంటే కీ బోర్డు మీద F5” క్లిక్ చేస్తాము. రిఫ్రెష్ చేయడం వల్ల RAM ఫ్రీ అవుతుందా..? సిస్టం Fast అయ్యేలా చేస్తుందా..? Performance బాగు పడుతుందా..? struck అవ్వకుండా చూస్తుందా..?
అయితే అలా జరుగుతుంది అనుకోవడం మీ అపోహ. అలా అనుకుంటూ ఉంటె మీరు పప్పులో కాలేసినట్టే..! మరి ఇంతకీ రిఫ్రెష్ చేయడం వల్ల లాభం ఏంటి..? ఎందుకు చేస్తాము! అంటే.. రిఫ్రెష్ చేయడం వల్ల సిస్టం ఏం క్లీన్ ఎవ్వడు. కేవలం డెస్క్ టాప్ మీద ఉండే ఐకాన్స్ అన్ని ఒకసారి పోయి మళ్ళీ వస్తాయి అంతే..! కంప్యూటర్ పెర్ఫార్మన్స్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు! ఛ! ఇన్ని రోజులుగా అనవసరంగా రిఫ్రెష్ చేస్తూ ఉన్నామే.