Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

మీరు వాడని పాత ఆండ్రాయిడ్ డివైస్ ను ఈ 7 విధాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా..?

Admin by Admin
March 23, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి తరుణంలో చాలా మంది కొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ పీసీలు మార్కెట్‌లోకి వచ్చాయంటే చాలు, వాటిని కొనుగోలు చేయడం, కొద్ది రోజుల పాటు వాడడం, ఆ తరువాత వాటిని సెకండ్ హ్యాండ్ ధరకు అమ్మడం లేదంటే ఇంట్లో ఓ మూలన పడేయడం జరుగుతోంది. అయితే ఫోన్లు ఏమో గానీ, మీరు వాడకుండా ఇంట్లో పడేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు కింద చెప్పిన విధంగా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వాడకుండా ఇంట్లో పడేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను కార్ నావిగేషన్ డివైస్‌గా వాడుకోవచ్చు. అందుకు కార్ మౌంట్ కిట్ ఒకటి తెచ్చుకుంటే చాలు, అందులో ట్యాబ్లెట్‌ను ఫిక్స్ చేసి దానికి నెట్ కనెక్షన్ ఇస్తే ఆ ట్యాబ్లెట్‌ను జీపీఎస్ నావిగేటర్‌గా వాడుకోవచ్చు. దీంతో మ్యాప్స్‌లో ఎటు వెళ్లాలో డైరెక్షన్స్ సులభంగా తెలుసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి మ్యాప్‌ను చాలా చక్కగా వీక్షించవచ్చు. దారి వెతకడం సులభతరమవుతుంది.

చాలా వరకు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు ఎంత లేదన్నా కనీసం 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. కనుక ఆ స్టోరేజ్‌లో పాటలు వేసుకుంటే ఎప్పుడైనా బయటకు సరదాగా వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్‌లో ఉన్న పాటలను వినవచ్చు. మ్యూజిక్ ప్లేయర్‌ను అందులో పెట్టుకుని పాటలు వింటూ సరదగా జర్నీ చేయవచ్చు. ఉల్లాసంగా గడపవచ్చు. మీ పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు సెక్యూరిటీ కెమెరాగా కూడా వాడవచ్చు. అందుకు ఏం చేయాలంటే… ఓ వాల్‌మౌంట్ కిట్‌లో ట్యాబ్లెట్ పీసీని ఫిక్స్ చేయాలి. మీరు అనుకున్న ప్రదేశంలో ఆ కిట్‌ను అమర్చాలి. అనంతరం అందులో ఐపీ వెబ్ క్యామ్ అనే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఇంటర్నెట్ డేటా ఆన్ చేసి యాప్ ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్‌లో ఉండే కెమెరా ఆన్ అవుతుంది. అది తనకు ఎదురుగా ఉన్న దృశ్యాలను రికార్డు చేస్తూ యాప్‌కు పంపుతుంది. యాప్‌లో మనకు లభించే ఓ ఐపీ అడ్రస్‌ను రాసి పెట్టుకోవాలి. దాన్ని మనం బయట ఎక్కడున్నా ఫోన్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఆ ఐపీ అడ్రస్‌ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంట్లో ఉన్న ట్యాబ్ కెమెరా లైవ్ దృశ్యాలను మనం ఫోన్‌లో బయట ఎక్కడైనా చూడవచ్చు. దీంతో ఆ ట్యాబ్ సీసీటీవీ కెమెరాలా పనిచేస్తుంది.

you can use your old android tab in these 7 ways

మీరు పుస్తకాలను ఎక్కువగా చదివే వారు అయితే మీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను డిజిటల్ బుక్ రీడర్‌గా వాడుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే గూగుల్ బుక్స్, అల్డికో, మూన్ ప్లస్ రీడర్ వంటి అనేక బుక్ రీడింగ్ యాప్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకిష్టమైన బుక్స్‌ను ట్యాబ్లెట్‌లో చదువుకోవచ్చు. ఎలాగూ పెద్ద డిస్‌ప్లే ఉంటుంది కాబట్టి బుక్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది. వాల్ మౌంట్ కిట్‌లో ట్యాబ్లెట్ పీసీని పెట్టి దాన్ని గోడకు అమర్చాక అందులో ఫొటో స్లైడ్ షో యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్స్‌ను ఓపెన్ చేస్తే అవి ట్యాబ్‌లో ఉన్న ఫొటోలను స్లైడ్ షోలా చూపిస్తాయి. దీంతో దూరం నుంచి చూస్తే ఫొటోలన్నీ గోడపై కదులుతున్నట్టు కనిపిస్తూ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది.

మీరు వాడని పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మీరు పర్సనల్ ప్లానర్‌గా కూడా వాడుకోవచ్చు. అందుకు పలు యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నాయి. సోల్ క్యాలెండర్, క్యాల్, క్యాలెండర్ ప్లస్, గూగుల్ నోట్ వంటి యాప్స్‌ను ట్యాబ్లెట్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక ప్రతి సారీ పెన్ను, పేపర్ పట్టుకుని నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు. ట్యాబ్లెట్‌లోనే ఆ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీరు వాడని పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో సిమ్ వేసుకునే సదుపాయం ఉంటే దాన్ని ఎంచక్కా వైఫై రూటర్‌లా వాడుకోవచ్చు. ఏదైనా సిమ్ వేసి అందులో డేటా బ్యాలెన్స్ వేయించుకుని, వైఫై హాట్ స్పాట్ పెట్టుకుంటే దాన్నుంచి ఇతర డివైస్‌లలో ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

Tags: android tablet
Previous Post

ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు…ఎప్పటికీ వాడకూడదంట! ఎందుకో తెలుసా?

Next Post

యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ యాక్ట్రెస్ బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మైండ్ బ్లాకే..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!