Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే ఎంత‌టి కోపం ఉన్న‌వారు అయినా స‌రే శాంత‌మూర్తులు అవ్వాల్సిందే..!

Admin by Admin
March 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అదిశక్తి.. పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్రరూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం….. దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు స్థిరపడినట్లు ఓ గాథ వినిపిస్తుంది. గోవాలోని జనబాహుళ్యంలో మాత్రం శాంతదుర్గ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలలూ తల్లడిల్లిపోయాయి. కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురి యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపింది.

ఒక చేత్తో విష్ణుమూర్తినీ, ఒక చేత్తో శివునీ పట్టుకుని వారిరువురి పోరునీ నిలిపింది. ఇదేదో ఈమధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం శాంతిదుర్గ పేర ప్రతిష్టించిన మూర్తులలో కూడా శివకేశవులని శాంతింపచేస్తున్నట్లుగా కనిపించే శాంతదుర్గని గమనించవచ్చు. దుర్గాదేవిని శాంతదుర్గ రూపంలో కొలవడం ఒక్క గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడ పుట్టలని కూడా శాంతదుర్గకి ప్రతిరూపంగా బావించి పూజించడాన్ని గమనించవచ్చు. ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామదేవతను పుట్టరూపంలో కొలుచుకునేవారనీ, ఆమే క్రమేపీ శాంతదుర్గగా మారిందన్న విశ్లేషణలూ ఉన్నాయి. సంతేరి అయినా శాంతదుర్గ అయినా పేరు ఏదైతేనేం, గోవా ప్రజలు మాత్రం ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలూ కలుగుతాయని భావిస్తారు.

shantadurga temple goa do you know the speciality of this temple

గోవాలో శాంతిదుర్గ పేరుతో చాలా ఆలయాలే ఉన్నా కావెలెం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమైంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు తొలుత కొలోసిం అనే గ్రామంలో ఉండేది. అయితే 1566లో గోవాని ఆక్రమించుకున్న పోర్చుగీసువారు కొలోసింలోని ఆలయాన్ని కూల్చివేయడంతో, అక్కడి మూలవిరాట్టుని కావెలెంకు తరలించారు. అలా కావెలెంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి 450 ఏళ్లు పూర్తయ్యాయి. చూసేందుకు అచ్చు ఐరోపా వాసుల భవంతిలా తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం.

కావెలెంలోని శాంతదుర్గను గోవాలని అనేక కుటుంబాలు తమ ఇలవేల్పుగా పూజించుకుంటున్నాయి. వారి క్షేమసమాచారాలను గమనించుకునేందుకు కావేలంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటుచేశారు. గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో అందమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

Tags: shantadurga temple goa
Previous Post

చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా..? అయితే దాని సంకేతం ఇదే!

Next Post

రోజూ 10 నిమిషాల పాటు బిగ్గ‌ర‌గా న‌వ్వితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!