Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

మంచం కింద ఈ వస్తువు ఉండాలి, లేకపోతే ఖాళీగా అయినా ఉండాలంట? ఎందుకో తెలుసా?

Admin by Admin
April 24, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీరు సాధార‌ణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేల‌పైనా..? మ‌ంచం పైనా..? నేల‌పైనైతే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వ‌ర్తించ‌దు. కానీ మంచంపై ప‌డుకునే వారైతే క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మ‌న‌లో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో త‌యారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థ‌లం లేద‌నో, మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో ఆ బెడ్స్ కింద ఏది ప‌డితే ఆ వ‌స్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని ప‌డితే దాన్ని పెట్ట‌కూడ‌ద‌ట‌. లేదంటే దాంతో మ‌న‌కు అన్నీ దుష్ఫ‌లితాలే క‌లుగుతాయ‌ట‌. అవేమిటంటే…

మీకు ఫెంగ్ షుయ్ వాస్తు తెలుసు క‌దా. చైనీయులు న‌మ్మే శాస్త్రాల్లో ఇది కూడా ఒక‌టి. అయితే మంచం కింద పెట్టే వ‌స్తువుల‌ను గురించి ఫెంగ్ షుయ్ శాస్త్రం ఏం చెబుతుందంటే… మ‌నం మంచంపై ప‌డుకున్నప్పుడు మ‌న చుట్టూ మంచం కిందుగా పాజిటివ్ శ‌క్తి తిరుగుతూ ఉంటుంద‌ట‌. మ‌న మెద‌డులోని స‌బ్‌కాన్షియ‌స్ మైండ్ ఆ శ‌క్తిని గ్ర‌హిస్తుందట‌. అయితే మంచం కింద ఏం లేకుండా ఉన్న‌ప్పుడు ఈ స‌బ్‌కాన్షియ‌స్ మైండ్ యాక్టివ్‌గా ఉండి ఎక్కువ శ‌క్తిని గ్ర‌హిస్తుంద‌ట‌. అదే మంచం కింద ఏదైనా వ‌స్తువు ఉంటే దాని వ‌ల్ల స‌బ్ కాన్షియ‌స్ మైండ్ శ‌క్తిని గ్ర‌హించేందుకు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో నెగెటివ్ శ‌క్తి ప్ర‌సార‌మై అది మ‌న‌కు కీడును క‌లిగిస్తుంద‌ట‌. అయితే మంచం కింద ఖాళీగా ఉంటే స‌బ్‌కాన్షియ‌స్ మైండ్ బాగా ప‌నిచేస్తుంది కానీ, ఒక ప్ర‌త్యేక‌మైన వ‌స్తువును పెడితే అది ఇంకా ఎక్కువ శ‌క్తిని గ్ర‌హిస్తుంద‌ట‌. దీనికి తోడు పాజిటివ్ ఎన‌ర్జీ కూడా పెరుగుతుంద‌ట‌. ఇంత‌కీ మంచం కింద పెట్టాల్సిన ఆ ప్ర‌త్యేక వ‌స్తువు ఏమిటంటే….

put this treasure box beneath your bed for luck

ట్రెజ‌ర్ బాక్స్‌… అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మంచం కింద ట్రెజ‌ర్ బాక్స్‌ను పెట్టి నిద్రిస్తే దాంతో మ‌న స‌బ్‌కాన్షియ‌స్ మైండ్‌కు మిక్కిలి శ‌క్తి వ‌స్తుంద‌ట. అయితే ట్రెజ‌ర్ బాక్స్ అంటే అదేదో నిధులు, మ‌ణులు, మాన్యాలు ఉన్న బాక్స్ అనుకునేరు. అది మాత్రం కాదు. కానీ దాదాపుగా అలాంటిదే. అయితే దాన్ని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎలాగంటే… ఇమిటేష‌న్ గోల్డ్‌, వెండి, చ‌లువ లేదా గ్రానైట్ రాయి, సెరామిక్ వంటి ప‌దార్థాల్లో దేన్ని ఉప‌యోగించైనా త‌యారు చేసిన ద‌ట్ట‌మైన మూత గ‌ల ఒక చిన్న పెట్టెను తెచ్చుకోవాలి. అందులో బంగారు ఆభ‌ర‌ణాలు, కాయిన్స్‌, క్రిస్ట‌ల్స్ వంటి వ‌స్తువుల‌ను వేసి బాక్స్ లాక్ చేయాలి. అనంత‌రం ఆ బాక్స్‌ను మీరు నిద్రించే మంచం కింద పెట్టాలి. అయితే ఆ పెట్టె మీ నాభి కిందుగా వ‌చ్చేట్టు చూసుకోవాలి. దీని వ‌ల్ల మీలో పాజిటివ్ శ‌క్తి పెరుగుతుంది. మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఉత్తేజం క‌లుగుతుంది. అంతేకాదు అదృష్టం కూడా వ‌స్తుంద‌ట‌. అయితే ఆ బాక్స్‌లో పైన చెప్పిన వ‌స్తువులు కాకుండా ప‌ర్‌ఫ్యూమ్‌లు, సెంట్లు, ఎరుపు రంగు కొవ్వొత్తులు, క్రీమ్‌, సువాస‌న ద్ర‌వ్యాలు, ఆయిల్స్ వంటి వాటిని ఉంచితే అలాంటి వారికి జీవితంలో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. ప్రేమించే వ్య‌క్తులు ద‌గ్గ‌ర‌వుతార‌ట‌. తెలుసుకున్నారుగా, ఫెంగ్ షుయ్ ట్రెజ‌ర్ బాక్స్ గురించి. ఇంకెందుకాల‌స్యం, వెంట‌నే మీరూ ఓ బాక్స్‌ను మంచం కింద పెట్టేయండి. ఒక వేళ పెట్ట‌కున్నా స‌మ‌స్యేమీ లేదు. కానీ ఆ స్థ‌లాన్ని మాత్రం ఖాళీగా ఉంచ‌డం మ‌రిచిపోకండి..!

Tags: Treasure Box
Previous Post

వరుడికి శృంగార సామర్థ్యం ఉందా లేదా అన్న విషయం పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది?

Next Post

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లిగి ధ‌నం రావాలంటే ఈ వ‌స్తువులు ఇంట్లో ఉండాల‌ట‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.