Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. ఇందులో పవన్ సరసన నిత్య మీనన్ నటించగా.. రానా పక్కన సంయుక్త మీనన్ నటించింది. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతోంది. పవన్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కాగా భీమ్లా నాయక్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం విదితమే. అలాగే డబ్బింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే డిజిటల్ హక్కులు, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమాకు విడుదలకు ముందే రూ.70 కోట్లు వచ్చాయని తెలిసింది.
ఇక మూవీని విడుదల చేశాక 35 రోజుల తరువాత ఏ సినిమా అయినా ఓటీటీలో వస్తుంది. కనుక ఏప్రిల్ 1వ తేదీ తరువాత భీమ్లా నాయక్ ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై జీవోను విడుదల చేయకపోయినా.. అక్కడ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించారు. కనుక కొంత వరకు కలెక్షన్లు సానుకూలంగానే వస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో రానున్న వారం రోజుల్లో ఈ మూవీ ఎన్ని కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.