Teeth : రోజూ మనం తినే ద్రవాలు, తాగే ఆహారాల వల్ల దంతాలపై సూక్ష్మ క్రిములు చేరుతుంటాయి. దీంతోపాటు దంతాలు గారపట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి. అయితే దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. దంత క్షయం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక నోరు, దంతాలను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే నోరు, దంతాలు చాలా బాగా శుభ్రమవుతాయి. పసుపు రంగులో ఉండే దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. మరి అందుకు ఏం చేయాలంటే..
ఒక టమాట కాయ, కొన్ని నారింజ పండు తొక్కలను తీసుకుని బాగా మెత్తగా నూరి పేస్ట్‌లా చేయాలి. అనంతరం అందులో ఉప్పు కలపాలి. ఆ మిశ్రమంతో దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే నోరు శుభ్రమవుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
ఒక చిన్న కప్పు తీసుకుని అందులో ఒక టీస్పూన్ కొబ్బరినూనె వేయాలి. అందులోనే అర టీస్పూన్ బేకింగ్ సోడా, అంతే మోతాదులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో దంతాలను తోముకుంటే అవి పసుపు రంగు నుంచి తెల్లగా మారుతాయి. తరచూ ఇలా చేస్తుంటే దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి.
నల్ల నువ్వుల పొడి ఒక టీస్పూన్ తీసుకుని అందులో కొద్దిగా లవంగాల నూనె కలపాలి. దాన్ని పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాంతో దంతాలను తోముకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే దంతాలపై ఉండే పసుపు దనం పోతుంది. దంతాలు తెల్లగా మారుతాయి. నోరు శుభ్రమై ఆరోగ్యంగా ఉంటుంది.